Big blow to Russia:పెప్సీ, కోక్, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ సేవల నిలిపివేత, ఈ కంపెనీలు కూడా షట్ డౌన్..

Ashok Kumar   | Asianet News
Published : Mar 09, 2022, 12:13 PM ISTUpdated : Mar 09, 2022, 12:14 PM IST
Big blow to Russia:పెప్సీ, కోక్, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ సేవల నిలిపివేత, ఈ కంపెనీలు కూడా షట్ డౌన్..

సారాంశం

ఉక్రెయిన్‌లో పెరుగుతున్న యుద్ధ సంక్షోభం దృష్ట్యా మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కోకా-కోలా, పెప్సికో, జనరల్ ఎలక్ట్రిక్‌తో సహా ఇతర పెద్ద కంపెనీలు రష్యాలో వాటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపాయి.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరుసగా 14వ రోజు కూడా కొనసాగుతోంది. రష్యాను ఆపడానికి అమెరికాతో సహా పెద్ద దేశాల కంపెనీలు అక్కడ సేవలను నిలిపివేయడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో పెప్సీ, కోక్, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అక్కడ తమ సేవలన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. 

మెక్‌డొనాల్డ్ ప్రెసిడెంట్ ప్రకటన
మెక్‌డొనాల్డ్స్ ప్రెసిడెంట్ అండ్ సిఇఒ క్రిస్ కెంప్‌జిన్స్కీ  ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. మా 850 స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నమని, అయితే రష్యాలోని 62,000 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ  స్టోర్లను తిరిగి ఎప్పుడు తెరవగలదో స్పష్టంగా చెప్పడం అసాధ్యం అని కెంప్‌జిన్స్కీ చెప్పారు.

కోక్ ఒక ప్రకటనలో 
ప్రజల రక్షణకు తోడ్పడటానికి, మేము రష్యాలో మా వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. అయితే, కోక్  వ్యాపారాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి, కోక్  భాగస్వామి స్విట్జర్లాండ్‌కు చెందిన కోకా-కోలా హెలెనిక్ బాట్లింగ్ కంపెనీ, దీనికి రష్యాలో 10 బాట్లింగ్ ప్లాంట్‌లు ఉన్నాయి. కోకా-కోలా హెలెనిక్ బాట్లింగ్ కంపెనీలో కోక్ కి 21 శాతం వాటా ఉంది. 

పెప్సికో అండ్ జనరల్ ఎలక్ట్రిక్ స్టాప్ సేవలు
పెప్సికో, జనరల్ ఎలక్ట్రిక్ రెండూ రష్యన్ వ్యాపారాలను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. న్యూయార్క్‌లోని పర్చేజ్‌లో ఉన్న పెప్సీ, రష్యాలో పానీయాల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  

కాఫీ చైన్ స్టార్‌బక్స్  వ్యాపారం కూడా మూసివేత
రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు కాఫీ చైన్ స్టార్‌బక్స్ మంగళవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా స్టార్‌బక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాలో స్టార్‌బక్స్ 130కి పైగా స్టోర్‌లు ఉన్నాయి. అన్ని స్టార్‌బక్స్ ఉత్పత్తుల షిప్‌మెంట్‌లతో సహా రష్యాలో అన్ని వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని మేము నిర్ణయించుకున్నట్లు సంస్థ తెలిపింది.

స్టార్‌బక్స్ CEO కెవిన్ జాన్సన్,  లైసెన్స్ పొందిన భాగస్వామి వెంటనే స్టోర్ కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించారని, రష్యాలో జీవనోపాధి కోసం స్టార్‌బక్స్‌పై ఆధారపడిన దాదాపు 2,000 మంది భాగస్వాములకు ఆర్థిక సహాయం అందిస్తామని రాశారు.

టెక్ దిగ్గజం యాపిల్
ఐఫోన్ మేకర్ యాపిల్‌ కూడా నిషేధం విధించింది, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ యాపిల్ గతంలో రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ, రష్యా మార్కెట్లలో తన ఉత్పత్తులన్నింటినీ విక్రయించడాన్ని నిషేధించింది. ఈ విషయంలో దిగ్గజ అమెరికన్ టెక్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలతో పాటు ఆపిల్ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఇది రష్యాకు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. యాపిల్ హింసకు గురైన వారందరికీ కంపెనీ అండగా ఉంటుందని నొక్కి చెప్పారు. 

అడిడాస్ పెద్ద అడుగు 
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య జర్మనీ  స్పొర్ట్స్ డ్రెస్ బ్రాండ్ అండ్ ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఒక పెద్ద ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా అడిడాస్ రష్యన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌తో భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. జర్మన్ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం 2008 నుండి దేశం  కిట్ మేకర్‌గా పని చేయడం ప్రారంభించింది, 2018లో దేశీయ ప్రపంచ కప్ కోసం షర్టులను డిజైన్ చేసింది. కానీ తూర్పు ఐరోపాలో మరణాల సంఖ్య పెరగడంతో  రష్యా జాతీయ జట్టుతో తన ఒప్పందాన్ని నిలిపివేసింది. UEFA నిషేధం నిర్ణయం తీసుకున్న  తరువాత అడిడాస్ ఈ ప్రకటన చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే