
ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్ బజార్ మరోసారి బారీ బంపర్ ఆఫర్ కి తెరలేపింది. సబ్సే సస్తా 5 దిన్ పేరిట ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఈ నెల 23న ఈ సేల్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రోజుల పాటు అంటే.. తిరిగి ఈ నెల 27వ తేదీన ఈ సేల్ ముగియనుంది. ఈ ఆఫర్ లో రూ.3వేల కంటే అధిక విలువైన ఆహార, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, దుస్తులు, చెప్పులు, బొమ్మలు,లగేజ్ తోపాటు ఇతర వస్తువులు కొనుగోలు చేసిన వారికి అదనంగా 20శాతం కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ లభించనుంది.
దీంతోపాటు రూపే కార్డు కలిగిన కొనుగోలుదారులకు అదనపు రాయితీ లభించనున్నది. కనీసంగా రూ.500 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 21నుంచి 22 లోపు రూ.1,000 షాపింగ్ చేసిన ప్రత్యేక సభ్యులకు రూ.100 అదనపు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు.
దుస్తులపై 50 శాతం రాయితీతోపాటు అదనంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, రూ.22,990 ధర కలిగిన కోర్యో 32 అంగుళాల సూపర్ స్లిప్ ఎల్‌ఈడీ టీవీ, 2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీని రూ.7,992కి, టన్ను స్లిట్ ఏసీ మూడు స్టార్ రేటింగ్‌ను రూ.27,990కి బదులు రూ.20,990కి, రెడ్మీ 6ఏ 2జీబీ/16జీబీని రూ.6,299కి, రెడ్మీ వై2 3జీబీ/32 జీబీని రూ.9,299కి, గృహోపకరణాలపై 60 శాతం డిస్కౌంట్‌తోపాటు 20 శాతం అదనపు క్యాష్ బ్యాక్ లభించనున్నది.