Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 27, 2022, 09:20 AM IST
Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. 

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఫిబ్రవరి 27, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు.వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.10, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. క్రూడ్ ధరలు మళ్లీ 95 డాలర్ల కిందకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.95 శాతం తగ్గింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 94.51 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.95 శాతం తగ్గింది. దీంతో ఈ రేటు 91.93 డాలర్లకు దిగివచ్చింది.

కాగా భారత్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో
Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?