సామాన్యులకు కేంద్రం వరం.. త్వరలో భారత్ బియ్యం.. ! కిలో రూ.25కే..

By Ashok kumar SandraFirst Published Dec 27, 2023, 6:05 PM IST
Highlights

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అధిగమించేందుకు కేంద్రం 'భారత్ రైస్'ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
 

దేశవ్యాప్తంగా బియ్యం రిటైల్ ధర గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. ఇండియన్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా కిలో బియ్యాన్ని రూ.25కే విక్రయించనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అధిగమించేందుకు కేంద్రం 'భారత్ రైస్'ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Latest Videos

'భారత్‌ ఆటా' (bharat  atta) పేరుతో గోధుమ పిండి, 'భారత్‌ దాల్' పేరుతో పప్పులు రాయితీ ధరలకు విక్రయాలు విజయవంతం కావడంతో రూ.25కే  కిలో బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.

ఈ భారత్ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), కేంద్రీయ భాండార్ అవుట్‌లెట్‌లు ఇంకా  మొబైల్ షాపుల ద్వారా విక్రయించాలని భావిస్తున్నారు.

సాధారణంగా బియ్యం రిటైల్ ధర కిలోకు సగటున రూ. 43.3కి చేరింది, ఇది గత ఏడాది కంటే ద్రవ్యోల్బణంలో 14.1 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఈ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు.

భారత్ గోధుమ పిండి కిలో రూ.27.50కి, చెనగ పప్పు కిలో రూ.60కి విక్రయిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా 2,000 రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భారత్ బియ్యం కూడా విక్రయించాలని భావిస్తున్నారు.
 

click me!