పేటీఎంలో చైనా పెట్టుబ‌డులు.. ప్ర‌శ్నించిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్‌..

By Sandra Ashok KumarFirst Published Oct 30, 2020, 4:09 PM IST
Highlights

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పేటీఎం ఉన్నతాధికారులు పార్లమెంట్ జాయింట్ కమిటీ ముందు హాజరయ్యారు. సున్నితమైన వ్యక్తిగత డేటాను నిర్వహించడం, విదేశాలకు బదిలీ చేయడం వంటి ప్రతిపాదిత చట్టంలోని ముఖ్య అంశాలపై సలహాలను సమర్పించారని తెలిపాయి.

డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫార్మ్ పేటీఎం కంపెనీలో చైనా పెట్టుబడుల గురించి పార్లమెంటరీ ప్యానెల్ గురువారం పేటీఎం ప్రతినిధులను ప్రశ్నించింది. కస్టమర్ డేటాను స్టోర్ చేసిన సర్వర్లు భారతదేశంలోనే ఉండాలని వారికి తెలిపింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి నేతృత్వంలోని క‌మిటీ ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లును ప‌రిశీలిస్తున్న విష‌యం తెలిసిందే.  

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పేటీఎం ఉన్నతాధికారులు పార్లమెంట్ జాయింట్ కమిటీ ముందు హాజరయ్యారు. సున్నితమైన వ్యక్తిగత డేటాను నిర్వహించడం, విదేశాలకు బదిలీ చేయడం వంటి ప్రతిపాదిత చట్టంలోని ముఖ్య అంశాలపై సలహాలను సమర్పించారని తెలిపాయి.

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్యానెల్ సభ్యులు పేటీఎంను ప్రశ్నించారు, ఇది ఒక భారతీయ సంస్థ అని చెప్పుకునేటప్పుడు వినియోగదారుల డేటాను సేకరించి స్టోర్ చేసిన సర్వర్ విదేశాలలో ఎందుకు ఉంది అని ప్ర‌శ్నించారు.

also read 

కస్టమర్ డేటా స్టోర్ చేసిన సర్వర్ భారతదేశంలోనే ఉండాలని ప్యానెల్ సభ్యులు పేటీఎం ప్రతినిధులకు చెప్పారు, అలాగే డిజిటల్ పేమెంట్ సేవలో చైనా ఎంత పెట్టుబడులు ఉన్నాయ‌ని, దాని “బ్యాకెండ్ లింకేజీల” గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని తెలిపాయి.

పేటీఎం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో  స్వంత ఉత్పత్తులను విక్రయిస్తుందని కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్, అమెజాన్ సంస్థ ప్ర‌తినిధులు పార్ల‌మెంట‌రీ ప్యానెల్ ముందు హాజ‌ర‌య్యారు, టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, క్యాబ్ అగ్రిగేటర్స్ ఓలా ఇంకా ఉబెర్ ప్రతినిధులు  పార్ల‌మెంట‌రీ ప్యానెల్ ముందు హాజరు కావాలని కోరారు.

పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును లోక్సభలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిసెంబర్ 11, 2019న ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వ్యక్తిగత డేటాను రక్షించడానికి మరియు డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది.

click me!