మార్చి 15, 16న బ్యాంకుల సమ్మె.. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన..

By S Ashok KumarFirst Published Feb 10, 2021, 3:15 PM IST
Highlights

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు  సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యూఎఫ్‌బీయూ మంగళవారం పిలుపునిచ్చింది.

న్యూ ఢీల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని రెండు బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ మార్చి 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) మంగళవారం పిలుపునిచ్చింది. 

గత వారం సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) ప్రైవేటీకరణను ప్రకటించారు.

బ్యాంకులలో మెజారిటీ వాటాను 2019లో ఎల్‌ఐసికి విక్రయించడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఐడిబిఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. అయితే గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది.

మంగళవారం జరిగిన యుఎఫ్‌బియు సమావేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటచలం తెలిపారు.

also read 

ఐడిబిఐ బ్యాంక్ అలాగే రెండు పిఎస్‌బిలను ప్రైవేటీకరించడం, బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం, ఎల్‌ఐసిలో పెట్టుబడులు పెట్టడం, ఒక జనరల్ బీమా కంపెనీని ప్రైవేటీకరించడం, బీమా రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వంటి సంస్కరణ చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేసిన వివిధ ప్రకటనలపై ఈ సమావేశంలో చర్చించారు.  

చర్చల తరువాత ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు అంటే  మార్చి 15, మార్చి 16న సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించినట్లు ఏ‌ఐ‌బి‌ఓ‌సి ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా తెలిపారు.

యూ‌ఎఫ్‌బి‌సి సభ్యులలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏ‌ఐ‌బి‌ఈ‌ఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏ‌ఐ‌బి‌ఓ‌సి), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్‌సి‌బి‌ఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏ‌ఐ‌బి‌ఓ‌ఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బి‌ఈ‌ఎఫ్‌ఐ) ఉన్నాయి.
 

click me!