వాహనదారులపై ఇంధన పిడుగు.. నేడు రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

By S Ashok KumarFirst Published Feb 10, 2021, 12:09 PM IST
Highlights

పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు కూడా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు పెంచాయి. నేడు డీజిల్ ధర 25 నుండి 30 పైసలకు, పెట్రోల్ ధర  26 నుండి 30 పైసలకు పెరిగింది. 

భారతదేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు కూడా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు పెంచాయి.

నేడు డీజిల్ ధర 25 నుండి 30 పైసలకు, పెట్రోల్ ధర  26 నుండి 30 పైసలకు పెరిగింది. ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు తాజా పెంపుతో మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

గత రెండు రోజల్లో పెట్రోల్, డీజిల్ ధర పై లీటరుకు 60 పైసలు పెరగడంతో ఢీల్లీలో పెట్రోల్ ధర నేడు 87 రూపాయలు దాటింది. దీంతో ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.87 దాటి తాజా పెంపుతో  లీటరుకు రూ .87.30, డీజిల్‌ లీటరుకు రూ .77.73 కు చేరింది.

హైదరాబాదులో పెట్రోల్  ధర 27పైసలు పెంపుతో నేడు లీటరుకు  రూ. 91.09, డీజిల్ ధర రూ. 84.79. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.90 దాటడం గమనార్హం.  

ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్ ధర రూ .3.89, డీజిల్ రూ .3.86 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు  60 డాలర్లు  దాటింది, ఇది గత సంవత్సరంలో అత్యధికం.

also read 

ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడుఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి..

నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         77.73    87.30
కోల్‌కతా    81.31    88.92
ముంబై    84.63    94.12
చెన్నై    82.90    89.96
హైదరాబాదు   84.79     91.09

ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవారిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

click me!