'ప్లీజ్, మీ డబ్బు తీసుకోండి': విజయ్ మాల్యా

By Sandra Ashok KumarFirst Published Feb 14, 2020, 4:24 PM IST
Highlights

64 ఏళ్ల మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాస్  విజయ్ మాల్యా మాట్లాడుతూ ఇడి, సిబిఐ ఒకే ఆస్తులపై పోరాడుతున్నాయని, ఈ ప్రక్రియలో అతనితో సరిగ్గా  వ్యవహరించడం లేదని అన్నారు.
 

లండన్: మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా  తాను రుణపడి ఉన్న మొత్తంలో 100% ఆస్తులను తిరిగి తీసుకోవాలని మరోసారి భారత బ్యాంకులను కోరారు.

విజయ్ మాల్యాను తిరిగి భారత్‌కు అప్పగించాలని ఇచ్చిన తిర్పును సవాల్ చేస్తూ బ్రిటిష్ హైకోర్టులో మాల్య పిటిషన్ వేశాడు. దీనిపై గురువారం తన మూడు రోజుల విచారణ పూర్తయ్యింది. విచారణ తరువాత కోర్ట్ ఆవరణలో విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడరు.

also read ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీవ్ బన్సాల్

64 ఏళ్ల మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత తాను బ్యాంకు రుణాలలో చెల్లించని  9,000 కోట్ల రూపాయలు, మనీలాండరింగ్ ఆరోపణలపై భారతదేశంలో కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయి అని ఆరోపించారు.

"నేను నా రెండు చేతులతో బ్యాంకులను వేడుకుంటున్న, నేను రుణపడి ఉన్న మొత్తంలో 100% వెంటనే వెనక్కి తీసుకోండి" అని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెలుపల అన్నారు.

"బ్యాంకులు నేను తీసుకున్న రుణాలు చెల్లించడం లేదని చేసిన ఫిర్యాదుపై ఇడి ఆస్తులను జత చేసింది. పిఎమ్‌ఎల్‌ఎ (మనీలాండరింగ్ నివారణ చట్టం) కింద నేను ఏ నేరాలకు పాల్పడలేదు. దయచేసి బ్యాంకులు మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి" అని ఆయన అన్నారు.

భారతదేశానికి తిరిగి వెళ్తార అని అడిగినప్పుడు, "నేను నా కుటుంబం ఎక్కడ ఉండాలో, నాకు ఎక్కడ ప్రయోజకరంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను" అని సమాధానం ఇచ్చారు.  

also read రైల్వే టికెట్‌ బుకింగులపై సంచలన నిర్ణయం...రానున్న రోజుల్లో ఇక పూర్తిగా....

మాల్యా చేసిన అప్పీల్‌కు అధ్యక్షత వహించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిసబెత్ లాయింగ్ ఈ కేసులో వాదనలు విన్నరు.


పెద్ద మొత్తంలో రుణాలు పొందడానికి మాల్యా అబద్దం చెప్పాడని, తరువాత అతను ఆ డబ్బుతో ఏదో చేశాడని, ఆ డబ్బును తిరిగి బ్యాంకుకు ఇవ్వడానికి నిరాకరించాడాని మేము కోర్టులో వదనలు వినిపించాము, ఇవన్నీ జ్యూరీ చేత నిజాయితీ లేని ప్రవర్తనగా గ్రహించవచ్చని ఒక లాయర్ అన్నారు.
 

click me!