
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఆగస్టు నెలలో బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేసింది. ఈసారి ఆగస్టులో వివిధ రాష్ట్రాల్లో 13 రోజుల సెలవులు ఉన్నాయి. అందుకే మీరు మీ స్టేట్ హాలిడేని చెక్ చేసుకొని, అందుకు అనుగుణంగా బ్యాంకుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ హాలిడే జాబితాను మూడు వర్గాలుగా విభజించింది. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌ల క్లోజింగ్ అకౌంట్స్ ఉన్నాయి. అలాగే జాతీయ సెలవులతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సెలవులు కూడా ఉంటాయి. వీటిలో ఆదివారం సెలవులు, నెలలో రెండవ మరియు నాల్గవ శనివారాలలో సెలవులు ఉన్నాయి.
ఆగస్టులో బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
ఆగస్టు 1 - ద్రుపక షీ-జీ పండుగ కారణంగా సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్‌లో అన్ని బ్యాంకులు మూసివేయబడ్డాయి
ఆగస్టు 7 - ఆదివారం వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 8 - మొహరం సందర్భంగా జమ్మూ మరియు శ్రీనగర్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి
ఆగస్టు 9 - చండీగఢ్, డెహ్రాడూన్, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, పనాజీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం, శ్రీనగర్ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మొహరం సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు.
ఆగస్టు 11 - రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఆగస్టు 13 - నెలలో రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 14 - ఆదివారం వారాంతం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ముంబై, నాగ్‌పూర్‌లోని అన్ని బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 18 - జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 21 - ఆదివారం వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28 - ఆదివారం వారాంతం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 - గణేష్ చతుర్థి సందర్భంగా బ్యాంకులకు సెలవు