April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్​లో బ్యాంకుల సెలవులివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 28, 2022, 12:49 PM IST
April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్​లో బ్యాంకుల సెలవులివే..!

సారాంశం

బ్యాంకుల విషయంలో రోజువారీ లావాదేవీలు ఇతర పనుల చేసేవారు బ్యాంకులకు సెలవులను గమనిస్తూ ఉండాలి. ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి..? ఏయే రోజుల్లో ఉన్నాయనే విషయాలు ముందుగానే తెలుసుకుంటే బ్యాంకుకు సంబంధించిన పనులను ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవచ్చు.   

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. బ్యాంకుల్లో ఏమైనా పనులు ఉంటే సెలవులకు ముందే త్వరగా పూర్తిగా చేసుకోండి. ఏప్రిల్ ఒక‌టో తేదీ నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి రోజు. బ్యాంకింగ్‌తోపాటు ఇత‌ర రంగాల ఉద్యోగుల‌పై ప‌నిభారం వ‌ల్ల సెల‌వులు వ‌స్తాయ‌ని ఆశిస్తుంటారు. ఏటీఎం కేంద్రాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని పనుల కోసం మనం బ్యాంకులకు వెళ్లాల్సిందే. లోన్, గోల్డ్ లోన్, లాకర్ వినియోగం సహా ఇతర పనులు కూడా బ్యాంకుకు వెళ్తేనే జరుగుతాయి. అయితే సెలవు రోజున బ్యాంకుకు వెళ్తే ఉట్టి చేతులతో తిరిగి రావాలి. కాబట్టి ఏప్రిల్ నెలలో ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకోవడం అవసరం.

ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానుంది. ఏప్రిల్​లో బ్యాంకులు మొత్తం 15 రోజులు సెలవులో ఉండనున్నాయి. ఈ సెలవులన్నీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. అన్ని బ్యాంకులకు కూడా ఈ సెలవులు వర్తించవు. ప్రాంతాన్ని బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి. రిజర్వు బ్యాంక్ ప్రకారం వివిధ ప్రాంతాల్లో స్థానిక పండుగలను, ప్రత్యేక రోజులను బట్టి ఈ సెలవులు ఉంటాయి. ఏప్రిల్‌ ఒక‌టో తేదీ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి రోజు, అదే రోజు పాత ఆర్థిక సంవ‌త్స‌ర ఖాతాల ముగింపు కావ‌డంతో బ్యాంకులు ప‌ని చేయ‌వు. బెలాపూర్‌, బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, ఇంఫాల్‌, జ‌మ్ము, ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, శ్రీ‌న‌గ‌ర్‌ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంకుల సెలవులివే..!

- ఏప్రిల్​ 1: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్​ క్లోజింగ్​ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవులో ఉంటాయి.

-ఏప్రిల్​ 2: ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.

- ఏప్రిల్​ 4: సర్హుల్ సందర్భంగా జార్ఖండ్​లో బ్యాంకులకు సెలవు.

- ఏప్రిల్​ 5: బాబు జగ్జీవన్ రామ్​ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)

- ఏప్రిల్​ 14: డాక్టర్​ బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్​, బోగ్ బిహు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

- ఏప్రిల్​ 15: గుడ్​ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్​, హిమాచల్ డే, విషు, (దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)

- ఏప్రిల్​ 16: బోగ్ బిహు

- ఏప్రిల్​ 21: గరియా పూజ

ఏప్రిల్​ 29: శాబ్-ఐ-ఖదర్​/ జుమాత్​-ఉల్​-విదా

సాధారణ సెలవులు ఇవే..!

- ఏప్రిల్​ 3- ఆదివారం

- ఏప్రిల్​ 9- రెండో శనివారం

- ఏప్రిల్​ 10- ఆదివారం

- ఏప్రిల్​ 17- ఆదివారం

- ఏప్రిల్​ 23- నాలుగో శనివారం

- ఏప్రిల్​ 24- ఆదివారం

ఇక‌పోతే.. బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ.. ఆన్​లైన్​ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని ఆన్​లైన్​ లావాదేవీలు 24 గంట‌లు పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్​డ్రా చేసుకోవ‌చ్చు. 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు