మీరు బ్యాంకుకు వెళ్తున్నారా.. అయితే ఫిబ్రవరిలో బ్యాంకుల హాలిడే లిస్ట్ చూడండి..

Ashok Kumar   | Asianet News
Published : Jan 30, 2021, 04:28 PM ISTUpdated : Jan 30, 2021, 04:31 PM IST
మీరు బ్యాంకుకు వెళ్తున్నారా.. అయితే ఫిబ్రవరిలో బ్యాంకుల హాలిడే లిస్ట్ చూడండి..

సారాంశం

 కరోనా వైరస్  వ్యాప్తి కారణంగా సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ బ్యాంకింగ్ విధులను పరిష్కరించుకోవాలని సూచించింది.

మీరు బ్యాంకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని ఫిబ్రవరి నెలలో చేయవలసి వస్తే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. కరోనా వైరస్  వ్యాప్తి కారణంగా సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం.

అందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ బ్యాంకింగ్ విధులను పరిష్కరించుకోవాలని సూచించింది.

బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఉంటే, ఫిబ్రవరి 2021లో బ్యాంకులు ఏ రోజు మూసివేయబడతాయో వినియోగదారులు తెలుసుకోవాలి.

also read ఆర్థిక సర్వే అంటే ఏమిటి..? బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకోండి.. ...

ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఆరు సెలవులు నిర్ణయించబడ్డాయి. ఈ సెలవులన్నీ 12, 15, 16, 19, 20 ఇంకా 26 తేదీలలో ఉన్నాయి. 

ఒక నెలలోని శనివారం, ఆదివారం కూడా దీనికి జోడిస్తే, మొత్తం సెలవులు 12 అవుతాయి. ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 28 ఆదివారాలు కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఇది కాకుండా, ఫిబ్రవరి 13న  నెలలో రెండవ శనివారం, ఫిబ్రవరి 27 న  నాల్గవ శనివారం, కాబట్టి ఈ రోజుల్లో కూడా  అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల, ఖాతాదారులు బ్యాంకుకు సంబంధించి ఏదైనా అత్యవసర పని చేయవలసి వస్తే ఈ తేదీలను గుర్తుపెట్టుకొండి.

 గమనిక: ఈ 12 సెలవుల్లో వివిధ రాష్ట్రాల్లో సెలవులు కూడా ఉన్నాయని తెలుసుకోండి. దీనికి సంబంధించిన ఇతర సమాచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ప్రతి రాష్ట్రనికి బట్టి సెలవులు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు వర్తించకపోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్