ఏప్రిల్ లో బ్యాంకులకు భారీగా సెలవులు : ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి..

By S Ashok KumarFirst Published Apr 1, 2021, 11:21 AM IST
Highlights

2021-22 ఆర్ధిక సంవత్సరం మొదలైంది  అయితే ఏప్రిల్ లో మీరు బ్యాంకుకి సంబంధించి ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వివిధ సెలవులతో పాటు బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి.
 

మీరు బ్యాంకుకి సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని ఈ నెలలో చేయవలసి వస్తే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. అలాగే బ్యాంక్ కస్టమర్లు కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో సురక్షితమైన భౌతిక దూరం  నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం.

ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ విధులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఒకవేళ కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఉంటే ఏప్రిల్‌లో ఏ రోజున బ్యాంకులు మూసివేయబడతాయో వినియోగదారులు ముందుగా తెలుసుకోవాలి.

ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు తొమ్మిది సెలవులు లభిస్తున్నాయి. ఈ సెలవులన్నీ ఏప్రిల్ 1, 2, 5, 6, 13, 14, 15, 16 ఇంకా 21 తేదీలలో ఉన్నాయి. 

also read 

1 ఏప్రిల్ 2021                 బ్యాంకుల అకౌంటింగ్
2 ఏప్రిల్ 2021                  గుడ్  ఫ్రైడే 
5 ఏప్రిల్ 2021                 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
6 ఏప్రిల్ 2021                 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021
13 ఏప్రిల్ 2021                తెలుగు నూతన సంవత్సరం / ఉగాది పండుగ 
14 ఏప్రిల్ 2021                డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి / తమిళ నూతన సంవత్సరం 
15 ఏప్రిల్ 2021                హిమాచల్ డే / బెంగాలీ న్యూ ఇయర్
16 ఏప్రిల్ 2021                బోహాగ్ బిహు
21 ఏప్రిల్ 2021               శ్రీ రామ్ నవమి

ఈ సెలవులకు శని, ఆదివారాలు కూడా చేర్చితే మొత్తం సెలవులు 15 అవుతాయి. ఏప్రిల్ 4, ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 25 ఆదివారాలు కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఇవి కాకుండా ఏప్రిల్ 10 రెండవ శనివారం, ఏప్రిల్ 24 నాల్గవ శనివారం కాబట్టి ఈ రోజుల్లో కూడా అన్ని రాష్ట్రాల్లోని  బ్యాంకులు మూసివేయబడతాయి. 

గమనిక: ఈ సెలవులు అన్ని వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ఇతర సమాచారం కోసం మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) అధికారిక  వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
 

click me!