భారత్‌ జీడీపీ వృద్ధిపై ప్రపంచ బ్యాంక్ అంచనాలు: 2021–22లో జోరందుకుంటుంది...

By S Ashok KumarFirst Published Mar 31, 2021, 12:04 PM IST
Highlights

2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతానికి పైగా పరిమితం అవుతుందని వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. అలాగే వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంకు అధికారి కూడా 10 శాతానికి మించి ఉండవచ్చని  తెలిపారు.

భారతదేశ  జీడీపీ వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. అలాగే భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతానికి 12.5 శాతానికి పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వృద్ధి రేటు 10 శాతానికి మించి ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.

'సౌత్ ఆసియా వ్యాక్సినేట్స్' పేరుతో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం "కరోనా వైరస్ వల్ల కలిగే ప్రపంచ అనిశ్చితి దృష్ట్యా 2021-22 ఆర్థిక సంవత్సరానికి  జిడిపి వృద్ధి రేటు 7.5 నుండి 12.5 శాతం వరకు ఉంటుంది" అని పేర్కొంది. టీకా ప్రచారం ఎలా కొనసాగుతుందో దానిపై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుంది అని తెలిపింది.

ఐ‌ఎం‌ఎఫ్ అంచనాలు 
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు  11.5 శాతంగా అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం తీవ్రంగా ప్రభావితమైందని, కంపెనీలు కరోనా ఎదురుదెబ్బ తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది.  అలాగే ఈ సానుకూల ప్రభావం వృద్ధి రేటుపై కనిపిస్తుంది అని తెలిపింది.

also read 

 వృద్ధి రేటు  అంచనాలు 
ఫిచ్ :  12.8 శాతం
మూడీస్ : 12 శాతం
ఐఎంఎఫ్ :  11.5
కేర్ రేటింగ్స్ : 11-11.2 శాతం
ఎస్ అండ్ పి : 11 శాతం
ఆర్‌బిఐ : 10.5 శాతం 

ఐఎంఎఫ్ 
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే మార్గంలో ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రకంపనల నుండి కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణల మార్గంలో ఉందని ఐఎంఎఫ్ ప్రతినిధి గ్యారీ రైస్ ఒక సమావేశంలో అన్నారు. అలాగే రియల్ జిడిపి వృద్ధి 2020 నాల్గవ త్రైమాసికంలో మళ్ళీ సానుకూలంగా ఉంటుంది అని తెలిపారు.

వచ్చే నెలలో ప్రపంచ బ్యాంకుతో సమావేశానికి ముందు ఈ ఆర్ధిక  సంవత్సరం మొదటి త్రైమాసికంలో పిఎంఐ వ్యాపారం, ఇతర గణాంకాలు నిరంతర అభివృద్ధిని సూచిస్తున్నాయని  ఐఎంఎఫ్ ప్రతినిధి చెప్పారు. ఇంకా కరోనా మహమ్మారి  సెకండ్ వేవ్ కారణంగా ప్రముఖ నగరాల్లో లాక్ డౌన్ స్థానికంగా కొన్ని అంతరాయలను కలిగించే అవకాశం ఉంది. ఇది ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు.   

click me!