Cyber ​​Attack:పీఎఫ్ వెబ్‌సైట్‌పై భారీ సైబర్ దాడి, కోట్ల మంది వ్యక్తిగత సమాచారం హ్యాకర్‌ చేతుల్లోకి ..

By asianet news teluguFirst Published Aug 8, 2022, 2:01 PM IST
Highlights

ఈ డేటా లీక్‌లో UAN నంబర్, పేరు, స్టేటస్, ఆధార్ కార్డ్, లింగం, బ్యాంక్ ఖాతా పూర్తి వివరాలు ఉన్నాయి. బాబ్ డయాచెంకో ప్రకారం, ఈ డేటా రెండు వేర్వేరు IP అడ్రస్ల నుండి లీక్ చేయబడింది.
 

28 కోట్ల మందికి పైగా ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారుల అక్కౌంట్ సమాచారం లీక్ అయింది. నివేదిక ప్రకారం, ఈ నెల ప్రారంభంలో పీఎఫ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ జరిగింది. బాబ్ డయాచెంకో(Bob Diachenko), ఉక్రెయిన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు దీనికి సంబంధించి ట్వీట్ చేశాడు.

బాబ్ డయాచెంకో  1 ఆగస్టు 2022న లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా ఈ హ్యాకింగ్ గురించి సమాచారాన్ని అందించారు. ఈ డేటా లీక్‌లో UAN నంబర్, పేరు, మెరిటల్ స్టేటస్, ఆధార్ కార్డ్, లింగం, బ్యాంక్ ఖాతా  పూర్తి వివరాలు ఉన్నాయి. బాబ్ డయాచెంకో ప్రకారం, ఈ డేటా రెండు వేర్వేరు IP అడ్రస్ ల నుండి లీక్ చేయబడింది. ఈ రెండు IPలు Microsoft Azure cloudకి లింక్ చేయబడ్డాయి.


మొదటి IP నుండి 280,472,941, రెండవ IP నుండి 8,390,524 డేటా లీక్‌ల నివేదికలు ఉన్నాయి. అయితే హ్యాకర్‌ను ఇంకా గుర్తించలేదు. అంతేకాకుండా, DNS సర్వర్ సమాచారం ఇంకా కనుగొనలేదు.

28 కోట్ల మంది వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు దీని గురించి సమాచారం అందలేదు. హ్యాకర్లు కూడా ఈ డేటాను తప్పుడు మార్గంలో ఉపయోగించుకోవచ్చు. లీక్ అయిన సమాచారం ఆధారంగా వ్యక్తుల నకిలీ ప్రొఫైల్‌లను కూడా సృష్టించవచ్చు.

ఈ డేటా లీక్ గురించి బాబ్ డయాచెంకో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కి కూడా తెలియజేశారు. నివేదికను పొందిన తర్వాత, CERT-IN ఈ-మెయిల్ ద్వారా పరిశోధకుడికి ఒక అప్ డేట్ అందించింది. రెండు IP అడ్రసులు 12 గంటల్లో బ్లాక్ చేయబడిందని CERT-IN తెలిపింది. ఈ హ్యాకింగ్‌కు ఇంకా ఏ ఏజెన్సీ లేదా హ్యాకర్ బాధ్యత వహించలేదు.

click me!