ఇప్పటివరకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్‌తో పలు రకాల లోన్ల గురించి విన్నాం. అయితే త్వరలోనే మ్యారేజ్ లోన్/ వెడ్డింగ్ లోన్ భారతీయులకు పరిచయం కానుంది
భారతీయులు పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నిరుపేదల దగ్గరి నుంచి అపర కుబేరుల వరకు తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించాలని కోరుకునే సమాజం మనది. అయితే ప్రస్తుత రోజుల్లో వివాహం అనేది ఖరీదైనదిగా మారిపోయింది. ఎంతో మంది పెళ్లిళ్ల కోసం తలకు మించి అప్పులు చేస్తున్నారు.
ఇప్పటివరకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్‌తో పలు రకాల లోన్ల గురించి విన్నాం. అయితే త్వరలోనే మ్యారేజ్ లోన్/ వెడ్డింగ్ లోన్ భారతీయులకు పరిచయం కానుంది.
వివాహం చేసుకోవాలనుకునే వారికీ లోన్ ఇచ్చేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ రెడీ అవుతోంది. పెళ్లి ఖర్చుల కోసం రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇస్తామని కంపెనీ చెబుతోంది. తీసుకున్న లోన్‌ను సులభ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.
వెడ్డింగ్ లోన్ కోసం అర్హతలు
* భారతీయుడై ఉండాలి
* 23 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి
* మల్టీనేషనల్ కంపెనీ లేదా పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ ఉండాలి
* గరిష్టంగా 60 నెలల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది
అయితే రుణం పొందేవారు నివసిస్తున్న నగరంలో పాటు వేతనాల ఆధారంగా ఎంత లోన్ మంజూరు చేయాలనే దానిపై కంపెనీ నిర్ణయిస్తుంది.