ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, రాకపోకలను సులభతరం చేయడానికి అన్ని వాహనాలకు అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌లు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.
మీ వాహనం జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేయనుంది. డిసెంబర్ 1 నుంచి అన్ని జాతీయ రహదారులపై ప్రతి వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.
(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) మీ వాహనం ముందు విండ్‌స్క్రీన్ పైన ఉన్న ఒక చిన్న ట్యాగ్ మీ వాహనాన్ని నిలిపివేయకుండా అన్ని టోల్ బూత్‌ల నుండి వెళ్ళడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ముఖ్యంగా ఫాస్టాగ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే టోల్ బూత్ వద్ద అగే సమయాన్ని తగ్గించడం ద్వారా ప్రయానికులు వేచి ఉండాల్సిన అవసరం ఇక ఉండదు.
undefined
also read స్విగ్గీతో విలీనాన్నీ ఖండించిన జోమాటో
టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని ఫాస్టాగ్ ఆదా చేయడానికి సహాయపడుతుంది. చాలా దూరం లేదా వేల కిలోమీటర్లు నడిచే వాణిజ్య వాహనాలకు, సొంత వాహనల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఫాస్టాగ్ ఉండటం వల్ల క్యూలో ఉండాల్సిన అవసరం లేదు.
ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.
1. రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1, 2019 నుండి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఎన్‌ఈటిసి( NETC) కార్యక్రమం కింద అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1 నుండి టోల్ చెల్లింపులు వాహనాల ఫాస్టాగ్ ద్వారా మాత్రమే ఉంటాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ బూత్ దాటడానికి రెట్టింపు రుసుము వసూలు చేయబడుతుంది.
2. వాహనం ముందు అద్దంపై అతికించిన RFID ట్యాగ్ ప్రత్యేక నెంబర్ ప్లాజాల యొక్క ప్రత్యేకమైన 'ETC' లో అమర్చిన స్కానర్ ద్వారా టోల్ ఛార్జ్ వినియోగదారుల ప్రీపెయిడ్ RFID ఖాతా నుండి వసూల్ చేయబడుతుంది. ఇది ఆన్‌లైన్ వాలెట్‌గా పనిచేస్తుంది. అంతే కాదు మీరు మార్చి 2020 వరకు 2.5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
3. ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసేటప్పుడు పేరు, ఫోన్ నెంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి) కాపీ ఇంకా కెవైసి వివరాలు తప్పని సారి.
4. ETC లేన్‌లు ఫాస్ట్‌టాగ్‌లను గుర్తించదానికి వాటికి ప్రత్యేకమైన కలర్ కోడింగ్ గుర్తింపు ఉంటుంది. అవి డిసెంబర్ 1 నుండి అన్ని లేన్‌లలో పనిచేస్తాయి. ఇది ప్రారంభంలో జాతీయ రహదారుల టోల్‌లకు మాత్రమే వర్తిస్తుంది. కొన్ని విధానాలు మరియు ఒప్పందాల కారణంగా రాష్ట్ర టోల్ ప్లాజాల అమలుకు ఇంకా కొంత సమయం పడుతుంది. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్ర టోల్ బూత్‌లకు పూర్తిగా విస్తరించాలని వారు భావిస్తున్నారు.
5. టోల్ ప్లాజాలకు సమీపంలో ఉన్న సేల్స్ కౌంటర్లు / పాయింట్ల వద్ద తమ ఫ్రాంచైజీల ద్వారా సెంట్రల్ క్లియరింగ్ హౌస్ (సిసిహెచ్) సేవలు, ఆర్‌ఎఫ్‌ఐడి ఆధారిత ఫాస్ట్‌టాగ్‌ను అందించడానికి ప్రభుత్వం అనేక బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.
also read షాకింగ్: క్రిప్టో, బ్లాక్ చైన్ టెక్నాలజీలపై కేంద్రం ఫ్రీ కోర్స్ ఆఫర్
6. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) వెబ్‌సైట్లలో ఫాస్ట్ ట్యాగ్‌లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు.
7. ఆన్‌లైన్‌లో ట్యాగ్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఆన్‌లైన్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ నుండి ఏదైనా కొనుగోలు చేసినట్లుగానే కొనుగోలు చెయ్యొచ్చు అది వారికి డోర్ డెలివరీ కూడా చేయబడుతుంది.
8. నవంబర్ 2016 లో భారత ప్రభుత్వం కొత్త వాహనాలన్నింటికి ముందు భాగంలో ఉన్న అద్దంపై ఫీచర్ ఫాస్టాగ్‌లు ఉండాలని ఆదేశించింది. ఆటోమొబైల్ తయారీదారులే దీనిని అందించాలని కోరింది.
9. పాత వాహనాల విషయానికొస్తే, వారు ఆయా కార్ల కంపెనీ డీలర్ల దగ్గర ఫాస్టాగ్‌లను పొందవచ్చు.
10. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వద్ద పనిచేసే అన్ని టోల్ ప్లాజాలు ఈ సంవత్సరం ప్రారంభంలో ఫాస్టాగ్ సౌఖర్యాలనులను కలిగి ఉంటాయి.