NSE New CEO: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కొత్త ఎండీ, సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియామకం..

Published : Jul 17, 2022, 09:38 PM IST
NSE New CEO: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కొత్త ఎండీ, సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియామకం..

సారాంశం

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కొత్త ఎండీ, సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ లిమాయే స్థానంలో ఆశిష్ నియమితులయ్యారు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కొత్త ఎండీ, సీఈవోగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియమితులయ్యారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( సెబి ) ఆశిష్‌ను ఎన్‌ఎస్‌ఇ అధిపతిగా నియమించింది. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ లిమాయే స్థానంలో ఆశిష్ నియమితులయ్యారు. లిమాయే పదవీకాలం జూలై 16తో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఉన్న ఆశిష్ కుమార్ చౌహాన్ ఎన్ఎస్ఈ సీఈవోగా నియమితులయ్యారు.

కొత్త MD, CEO ఆశిష్ కుమార్ బాధ్యతలు స్వీకరించే వరకు కంపెనీ వ్యవహారాలను నిర్వహించడానికి NSE  పాలకమండలి అంతర్గత కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిటీ రద్దు కానుంది.

ఆశిష్ కుమార్ చౌహాన్ ఎవరు?
ఆశిష్ కుమార్ చౌహాన్ అలహాబాద్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా పనిచేసిన భారతీయ వ్యాపార కార్యనిర్వాహకుడు. ఆయన భారతదేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్‌లలో ఒకటైన IIM రాయ్‌పూర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. భారతదేశంలో ఆధునిక ఆర్థిక ఉత్పత్తుల పితామహుడిగా ఆశిష్‌ను పిలుస్తారు. ఆర్థిక మార్కెట్ విధానాలు, సమాచార సాంకేతికత, వ్యవస్థీకృత రిటైలింగ్, టెలికమ్యూనికేషన్స్, భారతీయ సామాజిక సమస్యలపై ప్రముఖ నిపుణులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. 

IIT, IIMలలో విద్యాభ్యాసం,
ఆశిష్ కుమార్ చౌహాన్ IIT బాంబే నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి కూడా. చౌహాన్ మొదట్లో 1991లో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రస్తుతం IDBI బ్యాంక్) అధికారిగా నియమితులయ్యారు. 1993లో ప్రభుత్వం NSEలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించినప్పుడు, NSEని ఏర్పాటు చేసిన బృందంలో చౌహాన్ కీలక సభ్యుడు. 1993 నుండి 2000 వరకు అతను దాని ఈక్విటీ మరియు డెరివేటివ్ మార్కెట్లను స్థాపించడానికి బాధ్యత వహించాడు.

2009 సంవత్సరం నుండి BSEలో చౌహాన్ పనిచేశారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. 6 మైక్రోసెకన్ల ప్రతిస్పందన సమయంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎక్స్ఛేంజ్‌గా బీఎస్ఈ అవతరించడానికి కూడా సహాయం చేశాడు. భారతదేశంలో మొబైల్ స్టాక్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టాడు. చౌహాన్ BSEని కరెన్సీ, కమోడిటీ. ఈక్విటీ డెరివేటివ్‌లు, MMEలు, స్టార్టప్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, స్పాట్ మార్కెట్‌లు, పవర్ ట్రేడింగ్‌తో సహా కొత్త రంగాలను పరిచయం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్