యస్ బ్యాంక్ దివాళా... అనిల్ అంబానీకి కొత్త చిక్కులు, ఈడీ సమన్లు

By telugu news teamFirst Published Mar 16, 2020, 11:04 AM IST
Highlights

యెస్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి అతన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇప్పటికే ఎస్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా  బ్యాంకు ఆర్థికంగా  క్షీణించిన తరువాత నెలకు రూ .50 వేల చొప్పున వినియోగదారులు వితిడ్రా చేసుకున్నారు. 

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయనకు ఇప్పుడు ఎస్ బ్యాంక్ రూపంలో మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అనిల్ అంబానీకి సమన్లు జారీ చేశారు. 

ఇటీవల ఎస్ బ్యాంక్ ఫౌండర్ రాణాకపూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో అనిల్ అంబానీకి కూడా సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసినట్లు అధికారులు చెప్పారు.

Also Read రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్....

ఇప్పటికే దర్యాప్తుకి సహకరించాలని.. ముంబయిలో అధికారుల ముందు హాజరు కావాలని అనిల్ అంబానీకి ఆదేశించారు. . యెస్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి అతన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇప్పటికే ఎస్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా  బ్యాంకు ఆర్థికంగా  క్షీణించిన తరువాత నెలకు రూ .50 వేల చొప్పున వినియోగదారులు వితిడ్రా చేసుకున్నారు. 

అయితే... ఈడీ అధికారులకు అనీల్ అంబానీ సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారుల ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయన అధికారుల ముందు హాజరు కావడానికి మరికొద్ది రోజులు సమయం పడుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ లోగా అధికారులు   ఇతర రిలయన్స్ గ్రూప్ అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎస్ బ్యాంక్ కస్టమర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా లేకుండా పోయింది.

click me!