ఇకపై బస్టాండులు, బస్ డిపోలలో పెట్రోల్ బంక్‌లు..!

By Sandra Ashok KumarFirst Published Jun 5, 2020, 4:19 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగ పారిశ్రామిక రంగాలు, వ్యాపారాలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుతో రాష్ట్ర  ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని చక్కబెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ప్రధానంగా ఉన్న ప్రజారవాణా ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతాపం ఇంకా తగ్గట్లేదు. ముఖ్యంగా అగ్రదేశాలతో సహ భారతదేశంలో ఆర్ధిక వ్యవస్థపై కోలుకొని తీవ్ర ప్రభావం పడింది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగ పారిశ్రామిక రంగాలు, వ్యాపారాలు నష్టాల బాటలో నడుస్తున్నాయి.

లాక్ డౌన్ సడలింపుతో రాష్ట్ర  ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని చక్కబెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ప్రధానంగా ఉన్న ప్రజారవాణా ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తిసుకున్నారు.

ఇందులో భాగంగానే బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా ఉన్న 90 బస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.

also read విజయ్ మాల్యా అప్పగింత మరింత ఆలస్యం!!

అయితే పెట్రోల్ బంకులను ఆర్టీసీ సొంతంగా నడిపించాలా లేదంటే పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇవ్వాలా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం బయటికి రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో గత మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.

దీనిపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం వచ్చే అవకాశముంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండుల సమీపంలో పెట్రోల్ బంకులు లేవన్న సంగతి తెలిసిందే. దీని బట్టి ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం బస్టాండ్లలో బంకులు ఏర్పాటు చేస్తే కాంట్రాక్టు పద్దతిలో నడుపుతున్న బస్సులు కూడా ఇక్కడే ఇంధనం నింపుకునే అవకాశం ఉంటుంది.

దీనితో ఆర్టీసీకి అదనపు ఆదాయం కూడా వస్తుంది. సొంతంగా బస్ డిపోలలో, బస్టాండులలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తే ఆర్‌టి‌సికి లాభాలతో పాటు ఖర్చులు కూడా కలిసి వస్తాయి అనే వాదనాలు వినిపిస్తున్నాయి.  

click me!