అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి విదేశాలలో జరగబోతోందని గతంలో ఊహాగానాలు వినిపించాయి, కానీ ఇప్పుడు ఈ పెళ్లి ముంబైలోని జియో సెంటర్‌లో జరగబోతోందని తెలిపారు.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళీ భాజా మోగనుంది. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జూలై 12న BKC Jio వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగనుంది.
ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడి పెళ్లి అంతర్జాతీయ వేదికగా నిర్వహించబోతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ అలా లేదు ఈ పెళ్లి ముంబైలోనే జరగనుంది.
అంబానీ కుటుంబం గెస్టులకు సేవ్ ది డేట్ ఇన్విటేషన్స్ కూడా పంపించడం ప్రారంభించారు. ఈ పెళ్లి కార్డ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుక రోజున కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా నిర్ణయించారు. అయితే జూలై 12న జరిగే ఈ వేడుకకు అతిథులు భారతీయ దుస్తుల్లో రావాలి.
జూలై 13న ఇంకా రిసెప్షన్ జూలై 14 ఆదివారం జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్‌ను ఫిక్స్ చేశారు.
మొత్తం మూడు రోజుల ఈ పెళ్లి వేడుకలు BKC Jio వరల్డ్ సెంటర్‌లో జరుగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్న ఈ వివాహ వేడుకపై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.