అందుకే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియో చూస్తా: ఆనంద్ మహీంద్రా

Ashok Kumar   | Asianet News
Published : Aug 15, 2020, 02:59 PM ISTUpdated : Aug 15, 2020, 10:38 PM IST
అందుకే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియో చూస్తా: ఆనంద్ మహీంద్రా

సారాంశం

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక చిన్న పిల్లవాడు జాతీయ గీతం పాడే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ రోజు మనం చూసిన అత్యంత పూజ్యమైన వాటిలో ఇది ఒకటి. 

భారతదేశం నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ట్విట్టర్‌లో ఆశ్చర్యకరమైన వీడియోలను షేర్ చేయడంలో పేరుగాంచిన ఆనంద్ మహీంద్రా, స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. 

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక చిన్న పిల్లవాడు జాతీయ గీతం పాడే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ రోజు మనం చూసిన అత్యంత పూజ్యమైన వాటిలో ఇది ఒకటి. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే ముందు తనలో "జోష్" పొందడానికి ఈ వీడియోను చూస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టాడు, "నేను దీనిని గత కొన్ని ఏళ్ల క్రితం  మొదటిసారి చూశాను. అప్పటి నుంచి ఈ వీడియోను సేవ్ చేసుకొని   ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నాలో జోష్ పొందడానికి చూస్తాను.

also read నీతా అంబానీ, టీనా అంబానీ గురించి మీకు తెలియని విషయాలు.. ...

ఇది ఎంతో మంది అద్భుతమైన కళాకారులు చేసిన మ్యూజిక్‌ లా అనిపిస్తుంది. ఈ పిల్లోడి అమాయకత్వం, కాన్ఫిడెన్స్‌ నాలో జోష్‌ను నింపి నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది" అని ట్వీట్‌ చేశారు.

వీడియో క్లిప్‌లో, ఒక చిన్న పిల్లవాడు జాతీయ గీతాన్ని పడుతాడు. అతను పదాలను సరిగ్గా పలకడానికి కష్టపడుతున్నప్పటికీ అతని అమాయకత్వం, ఏకాగ్రత  ఆకట్టుకుంటుంది.

ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశాక వీడియో వైరల్ అయ్యింది. కొద్దిసేపట్లోని 6లక్షల కంటే ఎక్కువ  వ్యూస్ సంపాదించింది. వీడియోలోని పిల్లవాడిని ప్రశంసిస్తు చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు