వైరల్ వీడియో: వరల్డ్ బెస్ట్ బొలెరో డ్రైవర్ అంటూ థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

By Krishna AdithyaFirst Published Sep 12, 2022, 5:35 PM IST
Highlights

చమత్కారమైన ట్వీట్లకు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ రోజు తన ట్వీట్ లో  "ప్రపంచంలో అత్యుత్తమ బొలెరో డ్రైవర్" వీడియో అంటూ షేర్ చేసుకున్నారు.

మిస్టర్ కూల్ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో 36-సెకన్ల క్లిప్‌లో ఓ ఏనుగు బొలెరోను తరుముతున్నట్లు  కనిపిస్తోంది.అరనిమిషం ఉన్న ఈవీడియోను చూస్తే గుండె దడ పెంచడం ఖాయం.  అయితే ఈ వీడియోలో గొప్పదనం ఏమిటంటే ఏనుగు వాహనం వైపు దూసుకొస్తుంటే అటు డ్రైవర్ మాత్రం ప్రశాంతంగా వాహనాన్ని రివర్స్ చేస్తున్నాడు. కొంతసేపటికి ఏనుగు తన చేజింగ్ ను విరమించుకుంది. వెంబడించే సమయంలో, ఏనుగు బిగ్గరగా ఘీంకరిస్తూ తరమడం చూడవచ్చు. 

ఈ సంఘటన గత వారం కర్ణాటకలోని కబిని ఫారెస్ట్ రిజర్వ్‌లో జరిగిందని తెలిసింది. అయితే డ్రైవర్‌ను మిస్టర్ కూల్‌ అని వరల్డ్ బెస్ట్ బొలేరో డ్రైవర్ అని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. అలాగే ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు ఆయనను అభినందించారు.

ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్‌లో, “ఇది కబిని రిజర్వ్‌లో గత గురువారం జరిగినట్లు తెలుస్తోంది. కారు నడిపిన ఈ  వ్యక్తిని ప్రపంచంలోనే అత్యుత్తమ బొలెరో డ్రైవర్‌గా అభిషేకిస్తున్నాను, అతని పేరును కెప్టెన్ కూల్ గా మారస్తున్నట్లు తెలిపాడు. 

ఈ ట్వీట్ వైరల్‌గా మారగా, ఇప్పటివరకు 3,700కు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది యూజర్లు ట్వీట్‌కు ప్రతిస్పందించారు, డ్రైవర్ సంయమనాన్ని అంతా ప్రశంసించారు.

ఒక యూజర్ ఇలా కామెంట్ చేశారు. " కొన్ని విషయాలు మీ చేతుల్లో లేనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలో అతను మనకు చూపించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అన్ని ఇంద్రియాలను  నియంత్రించుకోవడం అంత కష్టం కాదనేందుకు అతను ఒక ఉదాహరణ అని చెప్పాడు.

మరొకరు ఇలా వ్రాశారు, "డ్రైవర్ ప్రశాంతంగా రివర్స్‌ గేర్ లో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటం థ్రిల్లింగ్ గా ఉందని ట్వీట్ చేశారు.  

ఆనంద్ మహీంద్రా  తరచుగా ఇంటర్నెట్ యూజర్ల ఆసక్తిని రేకెత్తించే ఆకర్షణీయమైన పోస్ట్‌లను పంచుకుంటాడు. పారిశ్రామికవేత్తకు ట్విట్టర్‌లో 9.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

click me!