మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

By Sandra Ashok KumarFirst Published Jan 17, 2020, 3:24 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975లో  స్థాపించినప్పటి నుండి అది వెలువరించిన  కార్బన్ ఉద్గారాలను మైక్రోసాఫ్ట్ కార్ప్ 2050 నాటికి పర్యావరణం నుండి తొలగిస్తామని తెలిపింది.
 

న్యూ ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా గత 45 సంవత్సరాలలో విడుదల చేసిన కార్బన్‌ ఉద్గారాలను తొలగిస్తామని కంపెనీ ప్రతిజ్ఞ చేయడంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సత్య నాదెల్లాను ట్విట్టర్ వేదికగా అభినందించారు."బ్రావో సత్య నాదెల్లా,"మహీంద్ర కంపెనీలలో ఒకటైన మహీంద్రా రైజ్ 2040 నాటికి వారు వెలువరించిన కార్బన్ ఉద్గారాలను తొలగిస్తామని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేసింది.

also read అమెజాన్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ఫైర్...కారణం ?

మైక్రోసాఫ్ట్ సీఈఓ కొత్త లక్ష్యం కోసం మహీంద్రా గ్రూప్ చైర్మన్ రాశారు.1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుండి అది వెలువరించిన అన్ని కార్బన్ ఉద్గారాలను మైక్రోసాఫ్ట్ కార్ప్ 2050 నాటికి  పర్యావరణం నుండి తొలగిస్తాం అని ప్రతిజ్ఞ చేసింది.

మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్లా "ఈ రోజు ప్రపంచం  కార్బన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది" అని అన్నారని ఓ వార్తా సంస్థ పేర్కొంది."మేము ఈ ఉద్గారాలను అరికట్టకపోతే, ఉష్ణోగ్రతలు పెరుగి ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని సైన్స్ నివేదికలు చెబుతున్నాయి" అని నాదెల్లా చెప్పారు.

also read క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొత్త ఫీచర్..ఏంటంటే ?


ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్, ఇది 2012 నుండి కార్బన్ న్యూట్రల్ గా ఉందని, అయితే వాతావరణ మార్పుల ప్రభావాలపై పోరాడటానికి "ప్రపంచ అవసరాలను తీర్చడానికి ఈ న్యూట్రలిటి సరిపోదు" అని అన్నారు.

గూగుల్, ఆపిల్‌తో సహా పలు టెక్ కంపెనీలు కార్బన్ న్యూట్రాలిటీకి కట్టుబడి ఉన్నాయి. 2040 నాటికి తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని అమెజాన్ కూడా తెలిపింది. అయితే కార్బన్ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చాలా అరుదు అని తెలిపింది.
 

click me!