అతిథులు సెల్‌ఫోన్‌లను ఉపయోగించడానికి ఖచ్చితంగా వీల్లేదు. అయితే ఈ ఈవెంట్ గోప్యంగా ఉంచేందుకే ఈ షరతు విధించారు.
ఆనంద్ అంబానీ - రాధిక మర్చంట్‌ల రెండవ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం లగ్జరీ యాచ్ క్రూయిజ్‌గా సెట్ చేసారు.
ఈ 'క్రూజ్ ట్రిప్'లో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పాల్గొననున్నారు. అంతేకాదు ఈ లగ్జరీ క్రూయిజ్ మే 30న ఇటలీలో ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగుస్తుంది.
ఈ క్రూయిజ్ ట్రిప్ ఈవెంట్ ఇన్విటేషన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ అనే నినాదంతో కూడా ప్రింట్ చేసారు. ఈ ఈవెంట్ కోసం ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 300 మంది VIPలను అతిథులుగా ఆహ్వానించారు.
ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి సింగ్ ధోని, హీరో రణబీర్ కపూర్, నటి అలియా భట్ ముంబై నుంచి ఇటలీకి వెళ్లనున్నారు.
అయితే ఈ లగ్జరీ క్రూయిజ్‌లోని అతిథులకు సెల్ ఫోన్‌లు ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే ఈ ఈవెంట్ గోప్యంగా ఉంచేందుకే ఈ షరతు విధించారు.
రిలయన్స్ CEO అండ్ భారతదేశపు అతిపెద్ద బిలియనీర్ ఆనంద్ అంబానీ - రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తొలి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజుల పాటు నిర్వహించారు.