ఎంత ప్రేమో.. శ్లోకా నవ్వులను క్యాప్చర్ చేయమంటున్న ఆకాశ్ అంబానీ

Published : Mar 07, 2019, 04:46 PM IST
ఎంత ప్రేమో.. శ్లోకా నవ్వులను క్యాప్చర్ చేయమంటున్న ఆకాశ్ అంబానీ

సారాంశం

మొన్నీమధ్యే ముఖేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి సంగతులు ఇప్పటికే అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. 

మొన్నీమధ్యే ముఖేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి సంగతులు ఇప్పటికే అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. తాజాగా.. వారి ఇంట మరో పెళ్లి సందడి మొదలైంది. అంబానీ- మెహతా కుటుంబసభ్యులు పెళ్లి వేడుకలను ప్రారంబించారు.

అంబానీ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. అన్న సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  కాబోయే వధూవరులు ఆకాశ్- శ్లోకా జంట చూడముచ్చటగా కనిపించింది. దీంతో.. ఆ జంట ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు మీడియా ఉత్సాహం చూపించింది. జంట కూడా.. ఫోటోలకు బాగానే ఫోజులు ఇచ్చారు.

అయితే.. ఆ సమయంలో శ్లోకా కొద్దిగా అలసటగా కనపడటంతో.. ఆమెను బాగా ఫోటో తీయాలని ఆకాశ్ ఫోటోగ్రాఫర్లకు ఆకాశ్ సూచించాడు. ‘‘ శ్లోకా నవ్వులను బాగా క్యాప్చర్ చేయండి. ది పుట్టిన రోజు కాదు. పెళ్లి వేడుక. ఇప్పుడు రెండు శరీరాలు.. ఒకే ఆత్మగా మారబోతున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఆకాశ్ మాటలతో శ్లోకా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక కార్యక్రమానికి వచ్చిన అతిథులైతే.. ఎంత ప్రేమో అంటూ కితాబు ఇచ్చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !