త్వరలో మార్కెట్లోకి రూ.20 నాణేం

By ramya NFirst Published Mar 7, 2019, 2:01 PM IST
Highlights

ఇప్పటి వరకు మనం రూ.2, రూ.5, రూ.20 నాణేలను చూసేసారు. త్వరలో రూ.20 నాణేన్ని కూడా చూడబోతున్నారు. 

ఇప్పటి వరకు మనం రూ.2, రూ.5, రూ.20 నాణేలను చూసేసారు. త్వరలో రూ.20 నాణేన్ని కూడా చూడబోతున్నారు. మీరు చదివింది నిజమే. త్వరలో రూ.20 నాణేం మన జేబుల్లోకి రానుంది. కొత్తగా రూ. 20 నాణెన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. తొలిసారిగా తీసుకువస్తున్న ఈ 20 రూపాయాల నాణేనికి 12 అంచులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుభుజి ఆకారంలో ఉండే రూ. 20 నాణేం.. దాదాపుగా రూ. 10 నాణేన్ని పోలి ఉంటుంది. 

కానీ గుండ్రంగా ఉండదు. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో రూ. 20 నాణేంను తయారు చేయనున్నారు. రూ. 20 నాణేంలో వెలుపలి లైన్ 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో, ఇక లోపలి భాగం 75 శాతం కాపర్, 20 శాతం జింక్, ఐదు శాతం నికెల్‌తో తయారవుతుంది. 

అయితే రూ. 10 నాణేం మాదిరి రూ. 20 నాణేంకు అంచుల్లో ఎలాంటి గుర్తులు ఉండవు. నాణేనికి ముందువైపు అశోకుడి స్తంభంపై ఉన్న మూడు సింహాల గుర్తు ఉంటుంది. సత్యమేవ జయతే అని హిందీలో రాసి ఉంటుంది. ఒక వైపు భారత్ అని హిందీలో, మరోవైపు ఇండియా అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.

click me!