ప్రాజెక్ట్ జీరోలో ఆటోమెటెడ్ ప్రొటెక్షన్, సెల్ఫ్-సర్విస్ ద్వారా నకిలీ ఉత్పత్తి తొలగింపు మరియు ఉత్పత్తి సీరియలైజేషన్ ఉన్నాయి. యుఎస్, యూరప్, జపాన్లలో ఇప్పటికే 7,000 బ్రాండ్లు "ప్రాజెక్ట్ జీరో"లో చేరాయి.
అమెజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు నమ్మకమైన వస్తువులను అందుకుంటున్నార లేదా నిర్ధారించడానికి అమెజాన్ మంగళవారం "ప్రాజెక్ట్ జీరో" ను భారత్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. "ప్రాజెక్ట్ జీరో"లో నకిలీలను గుర్తించడానికి, నిరోధించడానికి అలాగే తొలగించడానికి అదనపు విధానాలను పరిచయం చేస్తుంది.
also read రెండో వివాహం చేసుకోబోతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి కుమారుడు...
యుఎస్, యూరప్, జపాన్లలో ఇప్పటికే 7,000 బ్రాండ్లు "ప్రాజెక్ట్ జీరో"లో చేరాయి. భారతదేశంలో కూడా ఈ అనుభవాన్ని పరీక్షించడానికి కంపెనీకి సహాయపడటానికి అనేక భారతీయ బ్రాండ్లు పైలట్‌లో పాల్గొన్నాయి."ఈ ప్రయోగంతో భారతదేశంలో మరెన్నో బ్రాండ్లను చూడటానికి మేము సంతోషిస్తున్నాము.
చిన్న, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తల నుండి పెద్ద మల్టీ-జాతీయ బ్రాండ్ల వరకు మాతో భాగస్వామి మద్దతు ద్వారా నకిలీ బ్రాండ్లను సున్నాకి తిసుకురావడానికి, మా వినియోగదారులకు గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఏం. ధర్మేష్ మెహతా, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, ప్రపంచవ్యాప్త కస్టమర్ ట్రస్ట్ అండ్ పార్ట్నర్ సపోర్ట్, ఒక ప్రకటనలో తెలిపారు.
also read అంతర్జాతీయ విపణిలోకి భీమ్.. సింగపూర్‌లో ప్రారంభం...
"ప్రాజెక్ట్ జీరో" అమెజాన్ యొక్క అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. ఇది మూడు శక్తివంతమైన టూల్స్ ద్వారా పని చేస్తుంది: ఆటొమెటెడ్, సెల్ఫ్-సర్విస్ ద్వారా నకిలీ ఉత్పత్తి తొలగింపు మరియు ఉత్పత్తి సీరియలైజేషన్."అమెజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లు ఎల్లప్పుడూ నమ్మకమైన వస్తువులను అందుకునేలా చూడటానికి "ప్రాజెక్ట్ జీరో" మా దీర్ఘకాల పెట్టుబడులపై ఆధారపడుతుంది" అని మెహతా చెప్పారు.