ఆకర్షణీయ బ్రాండ్ ‘అమెజాన్’.. అటుపై మైక్రోసాఫ్ట్

By rajesh yFirst Published Jun 18, 2019, 11:16 AM IST
Highlights


భారతదేశంలో యువత ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అలా ఆకర్షణీయ బ్రాండ్లలో ఒక్కటిగా ఉన్న అమెజాన్‌ మొదటి స్థానం నిలువగా, మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సోనీ ఇండియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వరుసగా మూడేళ్లుగా గూగుల్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’గా నిలిచాయి.

న్యూఢిల్లీ: అత్యంత ఆకర్షణీయ బ్రాండ్లలో ఈ- కామర్స్ రిటైల్ జెయింట్ ‘అమెజాన్‌ ఇండియా’ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో టెక్నాలజీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సోనీ ఇండియా నిలిచాయని రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌)- 2019 నిర్వహించిన సర్వేలో తేలింది. 

ఫైనాన్సియల్ హెల్త్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీల వినియోగం, సంస్థ సాధించుకున్న కీర్తి ప్రతిష్ఠ అందుకు కారణంగా తేలింది. దీనిపై రాండ్‌స్టర్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) సంస్థ మొత్తం 32 దేశాల్లో రెండు లక్షల మందికి పైగా ప్రతినిధులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదిక సమర్పించింది.

ఇక మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సోనీ ఇండియా, మెర్సిడెజ్‌-బెంజ్‌, ఐబీఎమ్‌, ఎల్‌ అండ్‌ టీ, నెస్లే, ఇన్ఫోసిస్‌, శామ్‌సంగ్‌, డెల్‌ సంస్థలు టాప్‌-10లో స్థానం దక్కించుకున్నారు. గూగుల్‌ ఇండియాను గతేడాది ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ విభాగంలోకి చేర్చారు. గూగుల్ ఆఫ్ ఇండియా వరుసగా మూడేళ్ళుగా ఈ టైటిల్ గెలుచుకుంటుంది. 

భారతీయ ఉద్యోగులకు కంపెనీని ఎంచుకునే సమయంలో తొలి ప్రాధాన్యాలు వేతనం, ఉద్యోగి ప్రయోజనాలే. ఆ తర్వాత స్థానంలో వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సమతౌల్యం, ఉద్యోగ భద్రతలాంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కంపెనీ బ్రాండింగ్‌ అనేది అటు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు కోరుకుంటున్న కంపెనీలకు, ఇటు ఉద్యోగుల లక్ష్యాలకు మద్దతు పలికే కంపెనీలను కోరుకునే సిబ్బందికి చాలా కీలకంగా మారింది.

పెద్ద బహుళ జాతి సంస్థలు (ఎమ్‌ఎన్‌సీ)లపై ఎక్కువ శాతం (51%) మంది భారతీయులు తాము పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. కేవలం 9 శాతం మంది మాత్రమే స్టార్టప్ సంస్థల్లో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. 

ఐటీ, ఐటీఈఎస్‌, టెలికాం కంపెనీల్లో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు 67శాతం మంది పేర్కొన్నారు. రిటైల్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఈ-కామర్స్‌ రంగాల్లో 67శాతం, ఆటోమోటివ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో పని చేసేందుకు 65 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.
 

click me!