హైదరాబాద్ తెలుగు యువకుడికి అమెజాన్ జాబ్ ఆఫర్.. నెలకు జీతం ఎంతో తెలుసా ?

By S Ashok KumarFirst Published Apr 16, 2021, 11:23 AM IST
Highlights


తెలుగు యువకుడికి  అమెజాన్ అదిరిపోయే జాబ్ ఆఫర్ అందించింది. ఇటీవల అమెజాన్‌ నిర్వహించిన ‘ఫైనాన్షియల్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’కింద ‘సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌’గా  కాకినాడకు చెందిన వివేక్‌ రెడ్డి ఎంపికయ్యాడు.

హైదరాబాద్‌: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ 28 ఏళ్ల తెలుగు యువకుడికి అద్భుతమైన జాబ్ ఆఫర్ అందించింది. ముంబై డాన్‌బాస్కో స్కూల్‌లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివిన వివేక్‌ రెడ్డి ‘ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌’లో బీఏ చదివేందుకు మొదట లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరాడు.

అక్కడ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత కెనడా మాంట్రియల్‌లోని మెక్‌గిల్‌ వర్సిటీలోకి అడ్మిషన్‌ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ మూడేళ్ల పాటు చదివి డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా అట్లాంటాలోని జార్జ్‌టెక్‌ వర్సిటీలో 100% స్కాలర్‌షిప్‌తో ఎంబీఏలో చేరాడు. ఈ ఏడాది మేలో వివేక్‌ రెడ్డి తన ఎంబీఏ కోర్సును పూర్తి  కావొస్తుంది,

also read 

అయితే ఇటీవల అమెజాన్‌ నిర్వహించిన ‘ఫైనాన్షియల్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’కింద ‘సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌’గా  వివేక్‌ రెడ్డి ఎంపికయ్యాడు. జీతం, బోనస్, ఇతర కలుపుకొని ఏటా కోటి యాభై లక్షలు వార్షిక వేతనం పొందనున్నడు. వివేక్‌ రెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి, తల్లి భానురెడ్డి. కాకినాడకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

సూర్య నారాయణ సెబీ జీఎంగా పనిచేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.  తెలుగు రాష్ట్రంలో పుట్టి అమెజాన్ లో కోటికి పైగా వార్షిక  వేతనంతో ఉద్యోగం సాధించి తెలుగు యువతకు స్ఫూర్తి గా నిలిచాడు. 
 

click me!