మరీ అట్రాక్టివ్: కస్టమర్లకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ‘క్రెడిట్’ ఫెసిలిటీ!!

Published : Oct 01, 2018, 12:28 PM IST
మరీ అట్రాక్టివ్: కస్టమర్లకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ‘క్రెడిట్’ ఫెసిలిటీ!!

సారాంశం

మరీ అట్రాక్టివ్: కస్టమర్లకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ‘క్రెడిట్’ ఫెసిలిటీ!!

న్యూఢిల్లీ: భారతదేశంలో ఇప్పుడంతా పండుగల సీజన్. నవరాత్రులు మొదలు వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం వరకు అంతా పండుగలే పండుగలు. ప్రజలంతా పండుగల వేళ ఇంట్లో అవసరమైన వస్తువులు.. వాషింగ్ మిషన్లు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ ఫోన్లు.. ఇంకా విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడానికి అంతా ఇష్టపడతారు. కానీ ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు.. కార్పొరేట్ రంగ సంస్థల సిబ్బందికి వేతనాలు పుష్కలంగానే ఉన్నా.. సకాలంలో డబ్బు లభించక.. నగదు కొరత సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇటువంటి వారికి చేయూతనిచ్చేందుకు ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేశాయి. 

గ్రుహోపకరణాలను కొనుగోలు చేసేవారికి వడ్డీల్లేని రుణాలు అందిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. అందుకు రూ.60 వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేయడానికి సిద్ధం అయ్యాయి.  మరోవైపు ఈ - రిటైల్ సంస్థలు తమ వినియోగదారులకు భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ఆఫర్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 10 నుంచి ఐదు రోజుల పాటు రెండు సంస్థల ఆఫర్లు వినియోగదారులకు లభిస్తాయి. 

అమెజాన్ ఇండియా క్యాటగిరీ మేనేజ్మెంట్ ఉపాధ్యక్షుడు మనీష్ తివారీ మాట్లాడుతూ వినియోగదారులకు స్రుజనాత్మక చెల్లింపుల పరిష్కార మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఆన్ లైన్ లో 10 కోట్ల మందికి సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థల మొబైల్ యాప్‌లను వినియోగదారులు ఉపయోగించి రుణం మొత్తం పొందొచ్చు. 

సదరు యాప్‌ల్లో వినియోగదారులు తమ పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేసిన వెంటనే వారికి లభించే రుణం ఎంతో తెలుస్తుంది. అప్పటికప్పుడు వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల ధరలకు అనుగుణంగా రుణం లభిస్తుంది. ఇలా రుణాలు పొందిన వారు తమ డెబిట్ కార్డుల ద్వారా నెలవారీ ‘ఈఎంఐ’ల ద్వారా రుణ వాయిదాల్లో చెల్లించాల్సి వస్తుంది. వీటితోపాటు బై బ్యాక్ గ్యారంటీలు వినియోగదారులకు లభిస్తాయి.

PREV
click me!

Recommended Stories

BSNL New Year Plan : జియో, ఎయిర్‌టెల్ కు బిగ్ షాక్ ! బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ 2026 సూపర్ ప్లాన్
Gold Prices: బంగారం ఎఫెక్ట్.. పెళ్లి ఖర్చు రెట్టింపు అయిపోయింది, చెబుతున్న సర్వే