అదుర్స్!! సొంత రికార్డునే తిరగరాసిన ఆలీబాబా

By sivanagaprasad kodatiFirst Published Nov 12, 2018, 7:34 AM IST
Highlights

చైనా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘ఆలీబాబా’ తన రికార్డులనే తిరగరాసింది. ప్రతిఏటా నవంబర్ 11న నిర్వహించే డబుల్ 11 సేల్స్ ఈవెంట్‌లో ఆదివారం తొలి గంటలోనే 10 బిలియన్ డాలర్ల విక్రయాలు జరిపింది. మొత్తం సేల్స్ 31 బిలియన్ల డాలర్లుగా నిలిచాయి. గతేడాది రికార్డు కేవలం నాలుగు గంటల్లోనే చెరిపేసింది.

చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సేవల సంస్థ ఆలీబాబా ప్రకటించిన ఒకరోజ విక్రయ ఆఫర్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుత సంవత్సరంలో సింగిల్ డే ఆఫర్ ప్రారంభించిన తొలి ఐదు నిమిషాల్లో 300 కోట్ల డాలర్ల విక్రయాలు జరిపింది. తొలి గంటలోనే 10 బిలియన్ డాలర్లకు చేరుకున్న అమ్మకాలు చివరకు 31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకే గతేడాది సేల్స్ రికార్డును అధిగమించేసింది.

గడిచిన ఏడాది ఇదే రోజు విక్రయించిన 25 బిలియన్ డాలర్లతో పోలిసే 21 శాతం అధికం. ఇందుకోసం సంస్థ 1.80 లక్షల ఉత్పత్తులను సిద్ధంగా ఉంచింది. ‘అమెరికా షాపింగ్ హాలీడే బ్లాక్ ఫ్రైడే’ విక్రయాలను ఆలీబాబా సింగిల్స్ డే సేల్స్ ఆఫర్‌కు మరో రూపం ‘డబుల్ 11’ అనే వరల్డ్ బిగ్గెస్ట్ ఆన్ లైన్ సేల్స్ ఈవెంట్ అధిగమించేసింది. 

వాలంటైన్స్ డే సేల్స్‌కు పోటీగా విద్యార్థులు హాలీడే నాడు సంబురాలు చేసుకునేందుకు ఆలీబాబా ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. నెల రోజులుగా సాగుతున్న షాపింగ్ ఫెస్టివల్ నవంబర్ 11న జరిగే 24 గంటల సేల్స్‌లో పతాక స్థాయికి చేరుకున్నది. ఆలీబాబా అందించిన సేల్స్ ఆఫర్లలో షియామీ, ఆపిల్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. చైనాతోపాటు లాస్ ఎంజిల్స్, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో దేశాల నుంచి అధికంగా ఆర్డర్లు వచ్చాయి. 

వీటిలో ఆపిల్, షియోమీ, ఇతర మొబైల్ సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ నెలకొంది. కంపెనీ విక్రయాలు నిలకడగా ఉండటంతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేరు 16 శాతం వరకు పడిపోయింది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు కూడా పతనానికి ఆజ్యంపోశాయి. ఇదిలా ఉంటే ఆలీబాబా వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా హయాంలో చివరి నవంబర్ సేల్స్ ఈవెంట్ గా నిలిచిపోనున్దని. వచ్చే ఏడాది నుంచి సంస్థ చైర్మన్ గా ప్రస్తుత సీఈఓ డానియల్ జాంగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.  

click me!