అక్షయతృతీయ: 20శాతం పెరగనున్న అమ్మకాలు!

By rajashekhar garrepallyFirst Published May 6, 2019, 12:07 PM IST
Highlights

అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈసారి బంగారం అమ్మకాలు రెట్టింపు అవుతాయని జ్యువెల్లర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది. 

న్యూఢిల్లీ: అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈసారి బంగారం అమ్మకాలు రెట్టింపు అవుతాయని జ్యువెల్లర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది. 

ధరలు నిలకడగా ఉండటం, కొనుగోలుదారులు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో ఈసారి అక్షయతృతీయ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. 

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారినిక 20శాతం వరకు డిమాండ్ పెరుగుదల ఉంటుందని భారత బులియన్, జువెలర్ల అసోసియేషన్ అంచనా వేస్తోంది.

అంతేగాక, దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తుండటం, వేతన జీవులకు జీతం అందుకునే సమయం కావడంతో అక్షయ తృతీయ సేల్స్ ప్రోత్సాహకరంగా  ఉంటాయని భారత బులియన్, జువెలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షడు సౌరవ్ గాడ్గిల్ అభిప్రాయపడ్డారు. 

మే 7వ తేదీన అక్షయ తృతీయ కావడంతో పలు జువెల్లరీ సంస్థలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఇ కామర్స్ దిగ్గజాలు, బ్యాంకులు కూడా బంగారంపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాయి. 

click me!