విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుండి అమలు.. రెండేళ్ల లోపు పిల్లలకు మినహాయింపు..

By S Ashok KumarFirst Published Mar 25, 2021, 4:55 PM IST
Highlights

దేశీయ విమానాల కనీస ఛార్జీలను ఐదు శాతం పెంచనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విమాన ప్రయాణికులకు వచ్చే నెల నుండి మరో షాక్ తగలనుంది. అంటే ఏప్రిల్ 2021 నుండి ప్రయాణీకుల నుండి అధిక విమానయాన భద్రతా రుసుము (ASF) వసూలు చేయనుంది. 

కరోనా వ్యాప్తి కారణంగా ఆర్ధిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇప్పటికే కలత చెందుతున్నారు.  ఒక వైపు ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు సామాన్యుడికి మరింత భారం పెంచుతున్నాయి. మరోవైపు దేశీయ విమానాల కనీస ఛార్జీలను ఐదు శాతం పెంచనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విమాన ప్రయాణికులకు వచ్చే నెల నుండి మరో షాక్ తగలనుంది.

అంటే ఏప్రిల్ 2021 నుండి ప్రయాణీకుల నుండి అధిక విమానయాన భద్రతా రుసుము (ASF) వసూలు చేయనుంది. దీంతో దేశీయ ప్రయాణీకులు విమాన భద్రతా రుసుము రూ.200  చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఇది 160 రూపాయలుగా ఉంది. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల గురించి మాట్లాడితే వీరికి అధిక విమానయాన భద్రతా రుసుము  5.2 డాలర్ల నుండి 12 డాలర్లకి పెరుగుతుంది. ఈ చార్జీల  పెంపు 1 ఏప్రిల్ 2021 నుండి జారీ చేసిన టికెట్లకు వర్తిస్తాయి.

టికెట్ బుక్ చేసే సమయంలో విమానయాన సంస్థలు సేకరించే ఎ.ఎస్.ఎఫ్  ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లపై ఉపయోగిస్తారు.

also read వాహనదారులకు బిగ్ రిలీఫ్.. వరుసగా 2వ రోజు కూడా తగ్గిన ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ? ...

2019, 2020లో కూడా భద్రతా రుసుములను  పెంచారు.
గతంలో అంటే 1  సెప్టెంబర్ 2020 నుండి దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల నుండి  అధిక విమానయాన భద్రతా రుసుములను (ASF) వసూలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అప్పుడు దేశీయ విమాన ప్రయాణికుల ఎఎస్‌ఎఫ్‌  రూ .150 కు బదులుగా రూ .160 కు చార్జ్ చేశారు. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుండి  4.85 డాలర్లకు  బదులుగా 5.2 ఛార్జీలు వసూల్  చేశారు .  

దీనికి ముందు దేశీయ ప్రయాణికుల కోసం ఎఎస్‌ఎఫ్‌ను రూ .30 నుంచి రూ .150 కు పెంచుతామని, అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ మొత్తం 3.25 కు బదులుగా 4.85 గా ఉంటుందని 2019 జూన్ 7న మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ధరలు 1 జూలై 2019 నుండి అమల్లోకి వచ్చాయి.

 ప్రయాణికులకు డిస్కౌంట్ 
అయితే కొంతమంది ప్రయాణీకులకు ఈ చెల్లింపుల నుండి మినహాయింపు కల్పించారు. వీరిలో రెండేళ్ల లోపు పిల్లలు, డిప్లొమటిక్ పాస్‌పోర్ట్ హోల్డర్లు, ఆన్-డ్యూటీ ఎయిర్‌లైన్ సిబ్బంది, ఒకే టికెట్ ద్వారా మొదటి విమానంలో 24 గంటల్లో రెండవ కనెక్ట్ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులు ఉన్నారు.

దేశీయ విమానాల కనీస ఛార్జీలను కూడా ఐదు శాతం పెంచనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెరుగుదల ఏప్రిల్ చివరి నుండి వర్తిస్తుంది. ఈ పెంపుకు కారణం విమానం ఇంధనం ఖరీదైనదని చెబుతారు. అంతే కాకుండా 80 శాతం ప్రయాణీకుల సామర్థ్యాన్ని ఉంచాలని దేశీయ విమానయాన సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. 

click me!