వాహనదారులకు బిగ్ రిలీఫ్.. వరుసగా 2వ రోజు కూడా తగ్గిన ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Mar 25, 2021, 12:29 PM IST
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. వరుసగా 2వ రోజు కూడా తగ్గిన ఇంధన ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

సారాంశం

ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో  ఈ ఏడాది రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఒఎంసి) గురువారం పెట్రోల్ ధర పై 21 పైసలు, డీజిల్ ధర పై 20 పైసలు  తగ్గించాయి.

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా 2వ రోజూ కూడా దిగోచ్చాయి. ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో  ఈ ఏడాది రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఒఎంసి) గురువారం పెట్రోల్ ధర పై 21 పైసలు, డీజిల్ ధర పై 20 పైసలు  తగ్గించాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ‌ఓ‌ఎల్) వెబ్‌సైట్ డేటా ప్రకారం నేడు ఢీల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర లీటరుకు రూ.90.99 నుండి రూ.90.78 తగ్గింది. కోల్‌కతా  లీటర్ పెట్రోల్ ధర  రూ.90.98, ముంబైలో రూ.97.19, చెన్నైలో రూ.92.770, బెంగళూరు రూ.93.28, హైదరాబాద్ రూ.94.39, జైపూర్ రూ.97.31గా ఉంది.   

also read ఫుడ్ డెలివరీ పార్టనర్లకు స్విగ్గీ గుడ్ న్యూస్.. 2 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ది.. ...

ఢీల్లీలో  ఒక లీటర్ డీజిల్ ధర నిన్న రూ.81.30  నుండి రూ.81.10 పడిపోయింది. కోల్‌కతాలో డీజిల్ ధర లీటరుకు రూ.83.98, ముంబై రూ.88.20, చెన్నై  రూ.86.10, జైపూర్ రూ.89.60, బెంగళూరు  రూ.85.99, హైదరాబాద్ రూ.88.45గా ఉన్నాయి.

   ప్రపంచ చమురు ధరలు తగ్గింపు ఇలానే కొనసాగితే  వాహనదారులకు మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. భారతదేశంలో  పెట్రోల్, డీజిల్ అధిక ధరల వెనుక ఉన్న అతిపెద్ద కారణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక ఇంధన పన్ను.

ఒక్క భారతదేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలో దాదాపు 60% పన్ను ఉంటుందన్న సంగతి మీకు తెలిసిందే. ఇంధన అధిక ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిడికి దోహదం చేస్తాయని అలాగే చివరికి భారతదేశ ఆర్థిక పునరుద్ధరణను సమీప కాలంలో ప్రభావితం చేస్తాయని నిపుణులు గతంలో సూచించారు. పెట్రోల్, డీజిల్ అధిక ధరల కారణంగా ఇప్పటికే అవసరమైన నిత్యవసర వస్తువులు, సేవలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !