ప్రైవేటీకరణ చేస్తేనే బతుకు లేదంటే ‘మహారాజా‘కు తాళమే: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

By Sandra Ashok Kumar  |  First Published Nov 28, 2019, 11:05 AM IST

ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకుంటే దానికి భవిష్యత్ లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలు సక్సెస్ కాకపోతే దాన్ని మూసివేయడమే శరణ్యం అని పేర్కొన్నారు. ప్రైవేటీకరించినా ఉద్యోగులకు ప్రయోజనకర డీల్ సిద్ధం చేశామని తెలిపారు.


న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియాపై కేంద్ర పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్​దీప్ సింగ్​ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్నఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే మూతబడటం ఖాయమని హెచ్చరించారు. 

also read   ఆర్-కామ్ ఆస్తుల కోసం జియో, ఎయిర్‌టెల్ పోటీ

Latest Videos

undefined

బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ప్రయోజనాలను కాపాడుతామన్న హర్దీప్ సింగ్ పూరీ సంస్థలోని ఉద్యోగులందరికి లాభించే ఓ గొప్ప డీల్‌ను కుదిర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.

ఈ క్రమంలోనే ప్రైవేటీకరణ అయ్యే వరకు ఒక్క ఉద్యోగం కూడా పోదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘మీ ఎయిర్‌లైన్ ప్రైవేటీకరణ జరుగకపోతే మూతబడటం ఖాయం’ అని అంటూ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించి వారి మద్దతును కూడగట్టేందుకు మంత్రి ప్రయత్నించారు. 

‘ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది ముగిసిన తర్వాత బిడ్లను ఆహ్వానిస్తాం’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరిస్తామని ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

also read బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ...కారణమేమిటంటే!

ఇప్పటికే ఎయిర్ ఇండియాను పలుమార్లు అమ్మకానికి పెట్టినా.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో నిబంధనలను సడలించి మరోసారి కేంద్రం ప్రయత్నిస్తున్నది. సంస్థ రుణ భారం దాదాపు రూ.58 వేల కోట్లుగా ఉన్నది.2018లోనే మోదీ తొలి ప్రభుత్వం.. ఎయిర్​ ఇండియాలో 75 శాతం వాటా విక్రయించేందుకు బిడ్లు ఆహ్వానించింది. అయితే అందుకు ఏ ప్రైవేట్ కంపెనీ ముందుకు రాలేదు. దీంతో మళ్లీ అ దిశగా ప్రయత్నాలు జరగలేదు.

ఎయిర్​ఇండియా ఛైర్మన్ అశ్వనీ లోహానీతోపాటు విమానయాన మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నారు. గతవారం మంత్రుల బృందం చర్చించి.. ఎయిర్​ఇండియాపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హర్​దీప్​ పూరి తెలిపారు. ఎయిర్​ఇండియా ప్రభుత్వం అండతోనే నడుస్తోందని ఒక సభ్యుడి అనుబంధ ప్రశ్నకు సమాదానంగా హర్​దీప్​ పూరీ చెప్పారు. యూపీఏ మలి విడుత ప్రభుత్వం కూడా రూ.30,000 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని గుర్తుచేశారు.

click me!