ఆన్‌లైన్‌ ఫార్మసీని ప్రారంభించిన అమెజాన్‌.. అది చట్టవిరుద్ధమని పీఎంఓకు లేఖ..

By Sandra Ashok KumarFirst Published Aug 18, 2020, 6:20 PM IST
Highlights

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఆన్ లైన్ ఔషధాల అమ్మకాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించిందని, హోం డెలివరీ చేసే మందులు కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తాయని ఏ‌ఐ‌ఓ‌సి‌డి తెలిపింది. అమెజాన్ ఇండియా గురువారం బెంగళూరులో అమెజాన్ ఫార్మసీని ప్రారంభించింది.

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఎఐఓసిడి) శుక్రవారం అమెజాన్ ఇంక్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ ఒక లేఖ రాసింది. బెంగళూరులోని ఇ-కామర్స్ బెహెమోత్ ఇండియా   సబ్ సిడరి ఆన్‌లైన్ ఫార్మసీ వ్యాపారాన్ని ప్రారంభించడం చట్టవిరుద్ధమని లేఖలో పేర్కొంది.

జెఫ్ బెజోస్‌కు రాసిన లేఖ కాపీలను  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రభుత్వ అధికారులకు, 850,000 మంది భారతీయ రసాయన శాస్త్రవేత్తల సంఘం, డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ వంటి వివిధ చట్టాలు, నిబంధనలను ఉదహరించి అలాగే ఢీల్లీ హైకోర్టు నిర్ణయం ఆన్‌లైన్ ఫార్మసీలను స్టే చేస్తూ అమెరికాకు చెందిన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఆన్ లైన్ ఔషధాల అమ్మకాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించిందని, హోం డెలివరీ చేసే మందులు కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తాయని ఏ‌ఐ‌ఓ‌సి‌డి తెలిపింది.

also read 

అమెజాన్ ఇండియా గురువారం బెంగళూరులో అమెజాన్ ఫార్మసీని ప్రారంభించింది. ప్రాథమిక ఆరోగ్య పరికరాలు, ఆయుర్వేద మందులు కూడా వినియోగదారులకు సరఫరా చేయబడతాయి.’ అని సంస్థ తెలియజేసింది.

అన్ని ఆర్డర్‌లపై 20% వరకు తగ్గింపు కూడా ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. కోవిడ్ -19 వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ ఔషధం విభాగం గణనీయమైన ఊపందుకుంది. ప్రజలు లాక్‌డౌన్ అన్‌లాక్ తర్వాత కూడా వారు శ్వాసకోశ వ్యాధి బారిన పడే ప్రదేశాలకు వెళ్లడం మానేసారు.

అమెజాన్‌ వారం రోజుల నుంచి బెంగళూరులో ఓవర్ ది కౌంటర్, ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషధాల కోసం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. అదనంగా సంప్రదాయ మూలికా మందులు, గ్లూకోజ్ మీటర్లు, నెబ్యులైజర్లు, హ్యాండ్‌హెల్డ్ మసాజర్స్ వంటి కొన్ని ఆరోగ్య పరికరాలను కూడా అమెజాన్‌ విక్రయిస్తోంది. 
 

click me!