'ఈ డ్రెస్ కాస్ట్ చాలా హాట్ గురు.. !' దీపిక, అలియా, కరీనా తరువాత ముఖేష్ అంబానీ చిన్న కోడలు..

By asianet news telugu  |  First Published Nov 2, 2023, 3:47 PM IST

బాలీవుడ్ బ్యూటీస్ దీపికా, అలియా, కరీనా  కపూర్ వంటి హీరోయిన్స్ ఉన్నప్పటికి  ఫోటోగ్రాఫర్ల చూపు ముఖేష్ అంబానీ చిన్న కోడలుపై పడింది. ఎందుకు కారణం ఏంటి అనుకుంటుంన్నారా.. అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ అనంత్ అంబానీకి కాబోయే భార్య... 
 


భారతదేశంలోని అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజాను నవంబర్ 1న ముఖేష్ అంబానీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీపికా పదుకొనే, అలియా భట్, కరీనా కపూర్ వంటి క్యూట్ సెలెబ్రిటీస్ ఉన్నప్పటికి ఫోటోగ్రాఫర్ల  చూపు ముఖేష్ అంబానీ చిన్న కోడలుపై పడింది. కారణం ఏంటంటే.. కారణం అనంత్ అంబానీ చిన్న కొడుకుకి కాబోయే భార్య వేసుకున్న డ్రెస్. 

ముఖేష్ అంబానీ 'ఛోటీ బహు' ఆమె లుకింగ్ అండ్ డ్రెసింగ్  కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. దేశంలోని లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవానికి రాధికా మర్చంట్ రూ. 3,58,400 విలువైన డ్రెస్ ధరించి వచ్చారు. రాధికా మర్చంట్ మోనిక్ లుహిల్లియర్ డిజైన్ చేసిన  స్ట్రాప్‌లెస్ వెల్వెట్ కాక్‌టెయిల్ డ్రెస్‌లో అందంగా కనిపించింది. 

Latest Videos

Monique Lhuillier అమెరికా ప్రముఖ డిజైనర్లలో ఒకరు. ప్రియాంక చోప్రా, ఎమ్మా స్టోన్, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, టేలర్ స్విఫ్ట్, రీస్ విథర్‌స్పూన్ మరియు జెస్సికా ఆల్బా వంటి ప్రముఖులు లుహిల్లియర్ డిజైన్ చేసిన డ్రెస్సెస్   ధరించారు. 

రాధిక మర్చంట్  స్ట్రాప్‌లెస్ V-నెక్‌తో కూడిన వెల్వెట్ కాక్‌టెయిల్ డ్రెస్ ధరించారు. USAలో తయారు చేసిన ఈ డ్రెస్  బ్రాండ్  2023 రెడీ-టు-వేర్ కలెక్షన్స్ లో  భాగం. రాధికా మర్చంట్‌తో పాటు ముఖేష్ అంబానీ పెద్ద మేనకోడలు శ్లోకా మెహతా కూడా మోనిక్ లుహిల్లియర్ డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. ఫ్యాన్స్ కూడా వీరి డ్రెస్సెస్   ఇంకా  వారి అందమైన ఫోటోస్ కూడా క్లిక్  చేసారు. 

click me!