Latest Videos

ఆఫర్లే ఆఫర్లు.. మార్కెట్లోకి కొత్త రకం క్రెడిట్ కార్డ్.. అబ్బో అవన్నీ ఫ్రీ..

By Ashok kumar SandraFirst Published Jun 8, 2024, 12:56 PM IST
Highlights

అదానీ గ్రూప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అదానీ వన్ అంటారు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్‌తో క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. ఇందులో రెండు రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి.
 

క్రెడిట్ కార్డులు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. సామాన్య నుండి మధ్యతరగతి ప్రజలు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు కూడా వారి కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ రంగంలోకి అదానీ గ్రూప్ కొత్తగా అడుగుపెట్టింది. ICICI బ్యాంక్‌తో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును  ప్రారంభించింది. దీని ద్వారా  ప్రత్యేకంగా ఎయిర్ పోర్ట్  కనెక్టివిటీ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందుకోసం ఈ రెండు సంస్థలు వీసా సహకారంతో పనిచేస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డులు రెండు రకాలు.

వీటిని అధానీ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ అండ్  అదానీ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌లు అంటారు. ఈ రెండూ కార్డ్స్  అనేక రివార్డు పాయింట్స్, బెనిఫిట్స్  అందిస్తాయి. ఈ కార్డ్‌లు విమానాశ్రయం, ప్రయాణంలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీకు అదానీ వన్ యాప్‌తో విమానాలు, హోటళ్లు, రైళ్లు, బస్సులు, టాక్సీలను బుక్ చేసుకోవడానికి  ఇంకా అదానీ గ్రూప్‌లో కొనుగోళ్లపై ఏడు శాతం వరకు రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. విమానాశ్రయాలు, CNG బంకులు, కరెంట్ బిల్లు, ట్రైన్‌మ్యాన్ అదానీ ద్వారా నిర్వహించబడే ఆన్‌లైన్ రైలు టిక్కెట్లలో బెనిఫిట్స్  పొందవచ్చు.

ఈ కార్డులు చాలా  ప్రయోజనాలతో వస్తున్నాయి. కాంప్లిమెంటరీ ఫ్లయిట్ టిక్కెట్లు, VIP లాంజ్ యాక్సెస్, ప్రనాం మీట్ అండ్ గ్రీట్ సర్వీస్, పోర్టర్, వాలెట్, ప్రీమియం కార్ పార్కింగ్  ఇతర వెల్కమ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. కార్డ్ హోల్డర్‌లు డ్యూటీ-ఫ్రీ స్టోర్‌లలో షాపింగ్ చేయడం, విమానాశ్రయాలలో ఫుడ్  ఇంకా  పానీయాలపై డిస్కౌంట్స్, ఫ్రీ  మూవీ టికెట్స్, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు అలాగే  విదేశీ కొనుగోళ్లపై అదానీ రివార్డ్స్ పాయింట్‌లను పొందుతారు. అదానీ వన్ ICICI బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ అన్యువల్  ఫీజు  రూ.5,000, అయితే రూ.9 వేల బెనిఫిట్స్ పొందవచ్చు.  అదానీ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ చార్జెస్  ఏడాదికి రూ.750. ఇందులో మీకు రూ.5 వేల బెనిఫిట్స్ లభిస్తాయి.

విమానాశ్రయాలు, గ్యాస్, కరెంట్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ కంపెనీల్లో కొనుగోళ్లపై ఏడు శాతం వరకు డిస్కౌంట్  ఇతర లోకల్  అండ్  విదేశీ ఖర్చులపై రెండు శాతం వరకు తగ్గింపు ఉంటుంది. కార్డ్ హోల్డర్లు సంవత్సరానికి 16 సార్లు ప్రీమియం లాంజ్‌లతో సహా దేశీయ లాంజ్‌లను యాక్సెస్ చేయవచ్చు. అంతర్జాతీయ లాంజ్‌లను సంవత్సరానికి రెండుసార్లు సందర్శించవచ్చు. 8 వరకు వ్యాలెట్ అండ్  ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ లొకేషన్స్  ఉపయోగించుకోవచ్చు.

విమానాలు, హోటళ్లు అలాగే సెలవు రోజుల్లో రూ. 9,000 వరకు వెల్కమ్  బోనస్ ఉంటుంది. ఒక సినిమా  టికెట్ కొంటే మరొక   టిక్కెట్ ఫ్రీ. ఇంధన సర్‌ఛార్జ్‌పై ఒక శాతం మినహాయింపు ఉంటుంది. AdaniOne రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ ప్రోగ్రామ్‌కు ప్రత్యేకమైన యాక్సెస్‌ను ఉంటుందని  నివేదించారు.
 

click me!