Accenture Layoffs: మాంద్యం దెబ్బకు 19000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యాక్సెంచర్ ప్రకటన..

By Krishna AdithyaFirst Published Mar 23, 2023, 6:07 PM IST
Highlights

ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్  సుమారు 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు బాంబు పేల్చింది. కంపెనీ వార్షిక రాబడి, లాభాల అంచనాలను తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారడం వల్ల ఐటీ సేవలపై కార్పొరేట్ వ్యయం తగ్గుతోందని అందుకే ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ చర్య తీసుకుందని, రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

దాదాపు 19,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ గురువారం వెల్లడించింది. కంపెనీ వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను కూడా తగ్గించుకోవాలని నిర్ణయించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ కారణమని తెలిపింది, కార్పొరేట్ కంపెనీలు IT సేవలపై తమ వ్యయాన్ని తగ్గించడం ప్రారంభించాయి. ఈ ఎఫెక్ట్ తమ లాంటి కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులపై పడుతున్నాయని, అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపింది. 

మాంద్యం భయాల మధ్య, కంపెనీ ఖర్చులను తగ్గించుకుంటోంది..
ఇప్పటికే బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను తాకుతోంది. దీంతో టెక్నాలజీ కంపెనీలు తమ బడ్జెట్ కోతలను విధించేందుకు సిద్ధం అవుతున్నాయి. అనేక ఆందోళనల మధ్య కంపెనీ తన వార్షిక ఆదాయ వృద్ధి, లాభాల అంచనాలను గురువారం తగ్గించింది. కంపెనీ తాజా అంచనాలు స్థానిక కరెన్సీలో 8% నుండి 10% వార్షిక ఆదాయ వృద్ధిని సూచిస్తున్నాయి. 8% నుంచి 11% ఆదాయ వృద్ధిని కంపెనీ గతంలో అంచనా వేసింది. కంపెనీలో రిట్రెంచ్‌మెంట్ వార్తలు పబ్లిక్‌గా మారిన తర్వాత, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో నాలుగు శాతం జంప్ చూపించాయి.

🚨 Big - Accenture to Layoff around 19,000 Employees, About 2.5% of Current Workforce

— Ravisutanjani (@Ravisutanjani)

మరోవైపు  అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ కు సిద్ధం అవుతోంది. రాబోయే కొద్ది వారాల్లో మరో 9000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు కంపెనీ సోమవారం తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం, తొలగించబడే ఉద్యోగులలో ఎక్కువ మంది AWS, యాడ్స్, ట్విచ్‌ విభాగాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ స్వయంగా ధృవీకరించారు. భారతదేశంలో కూడా వేలాది మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని ఆయన చెప్పారు.

మెటాలో కూడా భారీ తొలగింపులు
అంతకుముందు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ అయిన మెటాలో రెండవ భారీ స్థాయి తొలగింపుకు సన్నాహాలు జరిగాయి. ఈసారి 10,000 మందిని తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. నాలుగు నెలల క్రితం సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కంపెనీ ఇంటి దారి చూపింది.

ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు
దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ అమెరికాలో భారీ ఉద్యోగాల కోతకు కారణం అవుతోంది. లేఆఫ్ ట్రాకింగ్ సైట్ ప్రకారం, టెక్ ప్రపంచంలో 2022 ప్రారంభం నుండి 280,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారు. 

click me!