AC Prices Rising: ఈ వార్త మీకోసమే.. పెరగనున్న‌ ఏసీ, ఫ్రిజ్‌ల ధ‌ర‌లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 21, 2022, 02:49 PM IST
AC Prices Rising: ఈ వార్త మీకోసమే.. పెరగనున్న‌ ఏసీ, ఫ్రిజ్‌ల ధ‌ర‌లు..!

సారాంశం

ఎండాకాలం అయిపోయిందిగా ఏసీ ఇప్పుడే ఎందుకనుకుంటే పెరగనున్న ధరలు చూస్తే వ‌ర్షా కాలంలోనే చెమటలు పట్టేస్తాయి. 5 స్టార్ రేటింగ్‌తో కొత్త ఏసీలు వచ్చే నెల నుంచి ఖరీదైనవిగా  మారనున్నాయి. ఏసీల ధరలు దాదాపు 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.   

మీరు ఈ వేసవి సీజన్‌లో AC ఫ్రిడ్జ్ ధరల పెరిగాయని, త్వరలో తగ్గగానే కొందామని ఇంకా కొనుగోలు చేయకపోతే ఈ వార్త మీకోసమే. కొనాలనుకునే ప్లాన్ ను ఇంకా వాయిదా వేసుకుంటున్నట్లయితే దానిని ఇక ఆలస్యం చేయటం మానుకోండి. ఎందుకంటే, 5 స్టార్ రేటింగ్‌తో కొత్త ఏసీలు వచ్చే నెల నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. అదే సమయంలో ఫ్రిజ్ ధరలు కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి. నిజానికి స్టార్ రేటింగ్‌లో మార్పు రావడం వల్లే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. అధిక రేటింగ్ ఉండే ఉత్పత్తులు అధిక ధర కలిగి ఉంటాయి. అధిక స్టార్ రేటింగ్ అంటే సదరు వస్తువు తక్కువ కరెంట్ వినియోగిస్తుందని అర్థం. పైగా అవి మరింత పర్యావరణ అనుకూలమైనవి.

స్టార్ రేటింగ్‌లో మార్పు కారణంగా వచ్చే నెల నుంచి ఏసీల ధరలు దాదాపు 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రతి రెండు సంవత్సరాలకు కొత్త స్టార్ రేటింగ్‌లు వర్తిస్తాయి. ఏసీల ఎనర్జీ రేటింగ్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 5 స్టార్లు ఉన్న ఏసీ వచ్చే నెల నుంచి 4 స్టార్లు మాత్రమే ఉంటుంది. అంటే వచ్చే నెల నుంచి తయారయ్యే కొత్త ఏసీలు ఇప్పుడున్న ఏసీల కంటే మెరుగ్గా ఉండనున్నాయి. ఇప్పుడు ఉన్న మోడళ్లలో సాంకేతికత బాగున్నప్పుడు దాని ధరలు కూడా పెరుగుతాయి.

వీలైనంత త్వరగా కంపెనీల వద్ద ఉన్న పాత స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీలు రకరకాల డీల్స్, ఆఫర్స్ కూడా అందించవచ్చు. వాస్తవానికి, కొత్త ఎనర్జీ రేటింగ్ వచ్చినప్పుడు, దాని కింద తయారు చేయబడిన ACలు మరింత శక్తివంతంగా ఉంటాయి. అంటే వాటిల్లో గతంలో కంటే తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. దీంతో వినియోగదారులకు చాలా డబ్బు ఆదా అవుతుంది. దీని కారణంగా.. కంపెనీలు తమ పాత స్టాక్‌పై మంచి డీల్స్ ఇవ్వగలవు. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కొత్త ఏసీతో పోలిస్తే కరెంటు బిల్లు ఎక్కువగానే ఉంటుందని గమనించాలి.

ACల స్టార్ రేటింగ్ వచ్చే నెల నుంచి మారుతోంది. అయితే ఫ్రిజ్ స్టార్ రేటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి జారీ చేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది జనవరి నుంచి ఫ్రిడ్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మార్గదర్శకాల మార్పుతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుందని, అధిక రేటింగ్ ఎనర్జీతో 4 స్టార్, 5 స్టార్ రిఫ్రిజిరేటర్లను తయారు చేయడం కష్టతరంగా మారుతుందని కంపెనీలు చెబుతున్నాయి. కాబట్టి ముందుగానే వీలును బట్టి కంపెనీలు ఇచ్చే ఆఫర్లను క్యాష్ చేసుకోండి.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !