ఇంటర్ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి నేడు భారతదేశంలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా నిలిచారు. ప్రస్తుతం రూ.1,30,000 కోట్ల విలువైన కంపెనీకి యజమానిగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసుకుందాం.
స్కూల్లో బాగా చదివి తెలివితేటలు ఉన్నవాళ్లే జీవితంలో ముందుంటారనేది పూర్తి నిజం కాదు. అదే సమయంలో, పరీక్షలో ఫెయిల్ అయిన వారందరూ జీవితంలో వెనుకబడిపోతారనడం కూడా శుద్ధ తప్పు. అకడమిక్ పరీక్షలో విఫలమై, జీవిత పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో భారతదేశంలోని ప్రముఖ ప్రయోగశాల ఫార్మా కంపెనీలలో ఒకటైన దివి ల్యాబ్స్ వ్యవస్థాపకుడు మురళీ దివి కూడా ఒకరు. ప్రస్తుతం దివి ల్యాబ్స్ అధినేతగా ఉన్న ఆయన, దేశంలోనే మొదటి మూడు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాల (API) తయారీదారులలో ఒకరిగా ఉన్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.1.3 లక్షల కోట్లు కావడం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన మురళి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతని కుటుంబానికి నెలవారీ ఆదాయం రూ.10 వేలు మాత్రమే. మురళీ దివి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా తన చదువును కొనసాగించి నేడు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఫార్మా వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.
undefined
తన అన్నయ్యలాగే మురళీదివి కూడా రసాయన శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే ఫార్మసీలో పట్టభద్రుడయ్యాక 1976లో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుని అక్కడే ఫార్మసిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. 25 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లిన ఆయన చేతిలో కేవలం రూ.500 మాత్రమే ఉన్నాయి. అక్కడే అతను చాలా కంపెనీలలో పనిచేశాడు. తర్వాత సంవత్సరానికి 65 వేల డాలర్లు సంపాదించాడు. కొన్నాళ్లు అమెరికాలో పనిచేసిన మురళి 40,000 అమెరికన్ డాలర్లతో ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.
1984లో మురళి ప్రముఖ ఫార్మా దిగ్గజం కళ్లెం అంజిరెడ్డితో చేతులు కలిపారు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్లు పనిచేసిన మురళి 1990లో సొంతంగా దివి లేబొరేటరీస్‌ను ప్రారంభించారు. ఆక్కడే ఆయన APIలు , ఇంటర్మీడియట్‌లను ఉత్పత్తి చేయడానికి వాణిజ్య ప్రక్రియలను కూడా ప్రారంభించారు. 1995లో మురళీ దివి తెలంగాణలోని చౌటుప్పల్‌లో మొదటి తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. 2002లో కంపెనీ రెండవ తయారీ కర్మాగారం విశాఖపట్నం సమీపంలో ప్రారంభమైంది.
మొదటి నుంచి మురళీ దివి తెలివైన విద్యార్థి కాదు. మచిలీపట్నంలో పీయూసీ పూర్తి చేసి, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ నుండి ఫార్మసీలో పట్టభద్రుడయ్యాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర విలువ 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది.