రూ. 2000 నోట్ల మార్పిడికి 24 గంటలు మాత్రమే గడువు..ఇంకా బ్యాంకులకు రాని రూ.12 వేల కోట్ల కరెన్సీ..

By Krishna Adithya  |  First Published Oct 6, 2023, 7:32 PM IST

రూ. 2,000 ముఖ విలువ కలిగిన 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు. అందులో ఇప్పటికీ రూ.12,000 కోట్లు. విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపారు.


రూ.2,000 నోట్ల మార్పిడికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా, దాదాపు రూ.12,000 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఇంకా చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు. రూ.2000 డినామినేషన్ నోట్లు 87 శాతం డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ద్వైమాసిక సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించిన సందర్భంగా శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో ఈ సమాచారాన్ని అందించారు. మే 19, 2023 నాటికి 3.56 లక్షల కోట్ల రూపాయలు చెలామణిలో ఉన్నాయి. సెప్టెంబరు 29 నాటికి రూ.3.42 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ గత శనివారం తెలిపింది. దీంతో మొత్తం రూ. 14,000 కోట్ల విలువైన నోట్లు తిరిగి రావాల్సి ఉందని పేర్కొంది. అయితే ఈ తేదీని మరో వారం పాటు పొడిగించగా, ఆ తేదీ రేపటితో పూర్తి కానుంది.  14,000 కోట్ల విలువైన రూ. 2,000  ముఖ విలువ కలిగిన నోట్లు బ్యాంకులకు తిరిగి రాని నేపథ్యంలో నోట్ల మార్పిడి వ్యవధిని సెంట్రల్ బ్యాంక్ మరో వారం పొడిగించింది. 

Latest Videos

undefined

ప్రస్తుతానికి అక్టోబర్ 7 నోట్ల మార్పిడికి చివరి రోజు కాగా ఇప్పుడు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. విలేకరుల సమావేశంలో ఇతర అంశాల గురించి మాట్లాడిన శక్తికాంత్ దాస్, ద్రవ్యోల్బణం తగ్గే వరకు ద్రవ్య విధానంలో ఎలాంటి సడలింపు ఉండదని చెప్పారు. ప్రభుత్వానికి బ్యాంకర్‌గా ఆర్‌బీఐకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విషయాలపై ఎలాంటి ఆందోళన లేదని ఇదే సందర్భంగా శక్తికాంత దాస్ అన్నారు. ఎక్కడ సంక్షోభం ఏర్పడుతుందో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని శక్తికాంత్ దాస్ ఫైనాన్షియర్లకు సూచించారు. 

రూ. 2000 నోటు 2016లో వచ్చింది..
2000 నోటు నవంబర్ 2016లో మార్కెట్‌లోకి వచ్చింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వాటి స్థానంలో కొత్త తరహాలో రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేశారు. అయితే 2018-19 సంవత్సరం నుంచి రూ.2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది.  'క్లీన్ నోట్ పాలసీ' కింద రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 'క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయవద్దని ప్రజలను అభ్యర్థించారు, ఎందుకంటే అలా చేయడం వల్ల వాటి రూపాన్ని పాడుచేయడంతోపాటు వాటి లైఫ్ టైం కూడా తగ్గుతుంది. లావాదేవీల కోసం ప్రజలకు మంచి నాణ్యమైన బ్యాంకు నోట్లను (పేపర్ కరెన్సీ) అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి క్లీన్ నోట్ పాలసీ అమలు చేస్తోంది.
 

click me!