బ్రిక్స్ గ్రూపులో 5 కొత్త దేశాలు..సౌదీ అరేబియా చేరడం దాదాపు ఖాయం..ఆగస్టులో సౌతాఫ్రికాలో బ్రిక్ సదస్సు నిర్వహణ

Published : Jun 30, 2023, 11:52 PM ISTUpdated : Jul 01, 2023, 02:14 AM IST
బ్రిక్స్ గ్రూపులో 5 కొత్త దేశాలు..సౌదీ అరేబియా చేరడం దాదాపు ఖాయం..ఆగస్టులో సౌతాఫ్రికాలో బ్రిక్ సదస్సు నిర్వహణ

సారాంశం

బ్రిక్స్ గ్రూపులో చేరేందుకు 25 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సౌదీ అరేబియా ప్రవేశం దాదాపు ఖాయమైంది. ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ . అర్జెంటీనా వంటి ఇతర ప్రముఖ దేశాలు బ్రిక్స్‌లో చేరే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఆగస్టులో జరగనున్న సదస్సులో బ్రిక్స్ దేశాల గ్రూపులో దాదాపు 5 కొత్త దేశాలను సభ్యులను చేర్చుకోవడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది ఆగస్టులను బ్రిక్స్ సదస్సును  దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. అయితే బ్రిక్స్ గ్రూపులో చేరేందుకు 25 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సౌదీ అరేబియా ప్రవేశం దాదాపు ఖాయమైంది. ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్,  అర్జెంటీనా వంటి ఇతర ప్రముఖ దేశాలు బ్రిక్స్‌లో చేరే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

BRICS దేశాలలో ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి, ఈ దేశాల్లో మొత్తం ప్రపంచ జనాభాలో 42 శాతం ఉండటం విశేషం . BRICS దేశాలు ప్రపంచ భౌగోళిక ప్రాంతంలో 33 శాతం, స్థూల దేశీయోత్పత్తిలో 23 శాతం, వాణిజ్యంలో 18 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే “బ్రిక్స్ విస్తరణ ఇప్పుడు దాదాపు ఖాయమైంది. మనం దానిని జాగ్రత్తగా నిర్వహించాలి. బ్రిక్స్‌లో సభ్యత్వం పొందడానికి 25 దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. బ్రిక్స్ గ్రూపింగ్‌లో ఎన్ని దేశాలను చేర్చవచ్చని అడిగినప్పుడు, మరో 5 మంది చేరవచ్చని అధికారి చెప్పారు. సౌదీ అరేబియా ప్రవేశం దాదాపు ఖాయమని ఆయన అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, అల్జీరియా చాలా ఆసక్తిని కలిగి ఉన్నాయి, కానీ అందరూ అర్హులు కాదు. ఇండోనేషియా, అర్జెంటీనా, ఈజిప్ట్ మంచి అభ్యర్థులు. అని అన్నారు. 

ఈసారి ఎలాంటి బలమైన ఆర్థిక ఫలితాలు వచ్చే అవకాశం లేదని, సదస్సు వర్చువల్‌గా ఉండొచ్చని అన్నారు. ఈ సంవత్సరం, 15వ బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22 నుండి 24 వరకు జరగనుంది, 'బ్రిక్స్, ఆఫ్రికా: పరస్పరం వేగవంతం వృద్ధి, స్థిరమైన అభివృద్ధి , సమ్మిళిత బహుపాక్షికత కోసం భాగస్వామ్యం' అనే థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. 

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ విశ్వజిత్ ధర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఒకదానికొకటి తెగిపోయినట్లు కనిపిస్తున్న బ్రిక్స్ దేశాలు విస్తరణ ద్వారా మరింత గుర్తింపు పొందుతాయని అన్నారు. "అరబ్ దేశాలు రష్యా, చైనా బ్రిక్స్ లో చేరడం వల్ల భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. దీని విస్తరణ సమూహంలో వేరే రకమైన సమూహాన్ని సృష్టిస్తుంది. ఇది మున్ముందు విస్తృత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే