Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్ వాలా పోర్టుఫోలియోలోని ఈ టాటా గ్రూపు స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచండి..

Published : Mar 13, 2022, 04:37 PM IST
Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్ వాలా పోర్టుఫోలియోలోని ఈ టాటా గ్రూపు స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచండి..

సారాంశం

Rakesh Jhunjhunwala portfolio: ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరొందిన రాకేష్ జున్ జున్ వాలా పోర్ట్ ఫోలియో అంటే ఇన్వెస్టర్లకు ఓ దిక్సూచి అనే చెప్పాలి. ఆయన ఏ షేరు కొంటున్నారు, విక్రయిస్తున్నారు అనేది ఎప్పుడూ ఓ వార్తే, అలాంటి రాకేష్ జున్ జున్ వాలా పోర్టు ఫోలియోలోని Tata Groupనకు చెందిన స్టాక్స్ మీద ఓ లుక్కేద్దాం. 

రాకేష్ జున్‌జున్ వాలా పోర్ట్‌ఫోలియో (Rakesh Jhunjhunwala portfolio) అంటే మార్కెట్  ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. ఆయన చేయి పడితే చాలు స్టాక్స్ మల్టీ బ్యాగర్లు అవుతుంటాయని నమ్ముతుంటారు. ఈ బిగ్ బుల్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు మూడు డజన్ల లిస్టెడ్ స్టాక్‌లు ఉన్నాయి. ప్రధానంగా టాటా గ్రూప్ షేర్లు ఎప్పుడూ ఆయన పోర్టు ఫోలియోలో కచ్చితంగా ఉంటాయి. '

వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా పోర్టుఫోలియోలో టాటా గ్రూపులోని ఈ 4 ప్రధాన షేర్లు ఉన్నాయి. ఈ స్టాక్స్ లో  టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియన్ హోటల్స్ ప్రధానంగా ఉన్నాయి.

రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టాటా గ్రూప్‌ స్టాక్స్ ఇవే..

1) టైటాన్ కంపెనీ:  (Titan Company) 
Q3లో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా. అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కంపెనీలో వాటాను కలిగి ఉన్నారు. రాకేష్ జున్‌జున్‌వాలా టైటాన్ కంపెనీకి చెందిన 3,57,10,395 షేర్లను కలిగి ఉన్నారు, ఇది కంపెనీ మొత్తం జారీ చేసిన చెల్లింపు మూలధనంలో 4.02 శాతం. అదేవిధంగా, రేఖా ఝున్‌జున్‌వాలా టైటాన్ కంపెనీలో 95,40,575 షేర్లు లేదా కంపెనీలో 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. 

2) టాటా మోటార్స్ (Tata Motors) 
అక్టోబర్ నుండి డిసెంబర్ 2021 వరకు టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీ  3,92,50,000 షేర్లను కలిగి ఉన్నారు, ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో సుమారు 1.18 శాతం. ఈ కాలంలో 11 శాతానికి పైగా నష్టపోవడంతో గత నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 1.50 శాతం, 1.25 శాతం క్షీణించాయి.

3) టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications)
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 30,75,687 షేర్లు లేదా 1.08 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత నెలలో, రాకేష్ జున్‌జున్‌వాలా యొక్క ఈ స్టాక్ 5 శాతానికి పైగా నష్టపోయింది. అయితే 2022లో ఈ స్టాక్ 20 శాతానికి పైగా పడిపోయింది.

4] ఇండియన్ హోటల్స్ కంపెనీ ( Indian Hotels Company)
 టాటా గ్రూప్ నకు చెందిన హాస్పిటాలిటీ స్టాక్ ఇది. రాకేష్ జున్‌జున్‌వాలాకు ఈ కంపెనీలో కూడా షేర్స్ ఉన్నాయి.  ఈ షేర్ గత నెలలో మంచి రిటర్న్‌  అందించిది. దాదాపు  4.30 శాతం రాబడిని ఇచ్చింది. 2022లో ఇది దాదాపు 10.50 శాతం పెరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్