Paytm Payments Bank: స్పందించిన పేటీఎం.. ఆర్‌బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 13, 2022, 04:24 PM IST
Paytm Payments Bank: స్పందించిన పేటీఎం.. ఆర్‌బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం..!

సారాంశం

ఆగస్ట్ 2016లో Paytm పేమెంట్స్ బ్యాంక్ స్థాపించారు. మే 2017లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించింది. నోయిడాలో మొదటి బ్రాంచ్ ప్రారంభించింది. Paytm పేమెంట్స్  బ్యాంక్ డిసెంబర్ 2021లో ‘షెడ్యూల్డ్ పేమెంట్స్ బ్యాంక్’గా పనిచేసేందకు RBI అనుమతిని పొందింది. 

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank)పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సంస్థకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ సిస్టమ్స్ పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ పూర్తి చేసేంతవరకు ఐటీ అడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. పేటీఎం బ్యాంకులో సూపర్ వైజరీ సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. పేటీఎం పేమెంట్స బ్యాంకులో శర్మ సొంతంగా 51శాతం వాటాను కలిగి ఉన్నారు.

అందుకే దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించేందుకు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటలో వెల్లడించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఐటీ సిస్టమ్‌పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ఐటీ ఆడిట్ సంస్థను నియమించాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం అనేది IT ఆడిటర్ల నివేదికను సమీక్షించిన తర్వాతే జరగాల్సి ఉంది. అది కూడా RBI మంజూరు చేసే నిర్దిష్ట అనుమతికి లోబడి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

ఆగస్ట్ 2016లో Paytm పేమెంట్స్ బ్యాంక్ స్థాపించారు. మే 2017లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించింది. నోయిడాలో మొదటి బ్రాంచ్ ప్రారంభించింది. Paytm పేమెంట్స్  బ్యాంక్ డిసెంబర్ 2021లో ‘షెడ్యూల్డ్ పేమెంట్స్ బ్యాంక్’గా పనిచేసేందకు RBI అనుమతిని పొందింది. తద్వారా ఆర్థిక సేవల కార్యకలాపాలను విస్తరించింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ గత డిసెంబర్‌లో 926 మిలియన్ల UPI లావాదేవీలను నిర్వహించింది. ఈ మైలురాయిని సాధించిన దేశంలోనే మొదటి లబ్ధిదారు బ్యాంకుగా Paytm Payments Bank అవతరించింది.

స్పందించిన పేటీఎం..!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటీఎంను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్చి 11న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై పేటీఎం స్పందించింది. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేయకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేటీఎం తెలిపింది. "పేటీఎం  పేమెంట్స్ బ్యాంక్ సాధ్యమైనంత త్వరగా ఆర్‌బీఐ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. ఆర్‌బీఐ ఆమోదం పొందిన తర్వాత కొత్త ఖాతాలను తిరిగి ప్రారంభించేటప్పుడు మేము తెలియజేస్తాము" అని రుణదాత తన ప్రకటనలో తెలిపింది. 


 

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?