బీకేర్‌పుల్: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక

By Rekulapally Saichand  |  First Published Nov 3, 2019, 2:28 PM IST

ఆదాయం రిఫండ్స్ పేరిట సైబర్ మోసగాళ్లు స్వైర విహారం చేస్తున్నారని, ఖాతాదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. 
 


ముంబై: ఆన్​లైన్​లో సైబర్​ నేరగాళ్లు స్వైర విహారం చేస్తున్నారు. ఇటీవల ఆదాయం పన్ను శాఖ పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అలాంటి నకిలీ మెసేజ్‌ల విషయమై భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెచ్చరిస్తోంది.


ఆదాయంపన్ను శాఖ పేరుతో మీకేమైనా సందేశాలు వచ్చాయా? జాగ్రత్తగా ఉండండి అది నకిలీ సందేశం కావచ్చు. ఆదాయం పన్ను రీఫండ్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టండి అంటూ మీ మొబైల్‌కు మెసేజ్‌ పెట్టి మిమ్మల్నే బురిడీ కొట్టిస్తున్నారు ఆన్​లైన్ చోరులు. 

Latest Videos

ఆ వివరాలను ఎవరికీ చెప్పొద్దూ.. ఖాతాదారులకు EPFO హెచ్చరిక

అలాంటి సందేశాలు రాగానే సైబర్‌ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయమని హెచ్చరిస్తోంది భారతీయ స్టేట్​ బ్యాంక్. నకిలీ మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసిన వెంటనే ఐడీ, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారు సైబర్‌ మోసగాళ్లు.

వాటి సాయంతో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది. అలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దని, వ్యక్తిగత ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది ఎస్బీఐ. 

రిలయన్స్ జియో రీఛార్జీలపై పేటీఏం సూపర్ ఆఫర్..

ఆదాయం పన్ను రీఫండ్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగానీ, కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రత్యేక అభ్యర్థలను కోరదు ఐటీ శాఖ. అందుకే అలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సైబర్​ నిపుణులు సూచిస్తున్నారు.

click me!