Union Budget 2023: రైల్వేకు 2.4 లక్షల కోట్లు.. యూపీఏ సర్కారు కంటే 9 రెట్లు అధికం: నిర్మలా సీతారామన్

By Mahesh K  |  First Published Feb 1, 2023, 2:13 PM IST

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించిన దానికి తొమ్మిది రెట్లు అధికం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
 


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వేకు రూ. 2.4 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. ఈ దశాబ్దంలో రైల్వేకు అత్యధిక బడ్జెట్ ఇదే. గత ఏడాది బడ్జెట్ కేటాయింపులకు ఇది నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వం తన చివరి కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించిన దానితో పోలిస్తే.. ప్రస్తుత కేటాయింపు 9 రెట్లు అధికం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

యూపీఏ ప్రభుత్వం 2013-14 కాలంలో రైల్వేకు కేటాయించిన బడ్జెట్ కంటే తాజాగా కేటాయించిన రూ. 2.4 లక్షల కోట్లు తొమ్మిది రెట్లు అధికం అని కేంద్ర ఆర్థిక మంత్రి వివరించారు.

Latest Videos

100 క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆమె రూ. 75 వేల కోట్లు కేటాయించినట్టు వివరించారు. ఇది రైల్వే శాఖకూ ప్రయోజనం చేకూర్చనుంది. ముఖ్యంగా ఫ్రెయిట్ బిజినెస్‌కు ఉపయుక్తం అవుతుంది. 

Also Read: Budget 2023: బడ్జెట్ తర్వాత ఏమేం వస్తువుల ధరలు పెరిగాయో, తగ్గాయో తెలుసుకోండి..

రైల్వే శాఖ ప్రతి ప్రభుత్వానికి ప్రధానమైన అంశంగా ఉన్నది. అందుకే కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు ప్రత్యేకంగా బడ్జెట్ సమర్పించేవారు. కానీ, 2016లో తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. అయినప్పటికీ రైల్వే బడ్జెట్ ప్రాధాన్యత ఎప్పటిలాగే ఉన్నది.

బడ్జెట్‌కు ముందు రోజు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే రైల్వే కృషిని కొనియాడింది. ప్యాసింజర్, ఫ్రెయిట్ ఈ రెండు సెగ్మెంట్‌లూ కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ రికవరీ చెందడంపై ప్రశంసించింది.

click me!