Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్

Published : Feb 01, 2025, 03:19 PM IST
Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్

సారాంశం

Union Budget 2025: ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ప్రకటించారు. కొత్త పన్ను స్లాబ్స్, రైతులకు కొత్త పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2025 బడ్జెట్‌లో మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలా, ఫైనాన్స్ మంత్రి  నిర్మలా సీతారామన్ 12 లక్షల రూపాయల వరకు ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రయోజనం కలిగించనుంది. అదనంగా, కొత్త పన్ను స్లాబ్స్, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందించనున్నారు.

కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్.. ఎంత ఆదాయానికి ఎంత తగ్గిందంటే

  • 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు

  • 16 లక్షల ఆదాయానికి ₹50,000 తగ్గింపు

  • 20 లక్షల ఆదాయానికి ₹90,000 తగ్గింపు

  • 25 లక్షల ఆదాయానికి ₹1,10,000 తగ్గింపు

  • సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పన్ను మినహాయింపులు

కిసాన్ క్రెడిట్ కార్డు విస్తరణ & వ్యవసాయ పథకాలు

  • 7.7 కోట్ల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులపై పరిమితి ₹5 లక్షల రుణం వరకు పెంపు

  • వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు 6 ఏళ్ల “ఆత్మనిర్భర్ మిషన్” ప్రారంభం

  • కొత్త ఎరువుల సబ్సిడీ విధానం

  • నూతన ఆర్గానిక్ వ్యవసాయ ప్రోత్సాహక పథకం

గ్రామీణ అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు

  • 100 అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్‌లో ఉపాధి, వ్యవసాయ పెట్టుబడులు

  • వలసలపై ఆధారపడకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

  • రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి భారీ నిధుల కేటాయింపు

గిగ్ వర్కర్లకు మద్దతు & ఉపాధి అవకాశాలు

  • ఈ-శ్రమ్ పోర్టల్‌లో గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్

  • ఆరోగ్య సంరక్షణ కోసం PM జన ఆరోగ్య యోజన లబ్ధి

  • కొత్త ఉపాధి కల్పన పథకాలు

  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు బీమా మరియు మౌలిక వసతులు

MSMEs & స్టార్టప్స్‌కు ప్రోత్సాహం

  • స్టార్టప్‌లకు ఫండ్ ఆఫ్ ఫండ్స్ – ₹10,000 కోట్లు

  • ఎగుమతిదారుల కోసం కొత్త రుణ గ్యారంటీ పథకం

  • చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారంటీ ₹10 కోట్లు

  • టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు మద్దతు

విద్య, వైద్య రంగాల్లో కీలక నిర్ణయాలు

  • IITsలో 6,500 సీట్ల పెంపు

  • కొత్త AI ఎడ్యుకేషన్ సెంటర్ - ₹500 కోట్లు

  • అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ

  • కేన్సర్, అరుదైన వ్యాధులకు 36 మందులకు  ప్రత్యేక రాయితీలు

  • ఆరోగ్య రంగ అభివృద్ధికి ₹15,000 కోట్లు కేటాయింపు

  • గ్రామీణ వైద్య సేవలకు ప్రత్యేక పథకాలు

పర్యాటకం అభివృద్ధి & నూతన బడ్జెట్ చట్టం

  • 50 ప్రధాన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

  • ఈ-వీసా సదుపాయాలు మరింత వేగవంతం

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం – 50% తక్కువ క్లాజులు, సరళీకృత విధానం

  • పర్యాటక రంగ ప్రోత్సాహకాలకు భారీ నిధుల కేటాయింపు

  • కస్టమ్స్ విధానాల్లో సులభతర మార్పులు

నూతన పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు

  • నూతన రవాణా మార్గాల అభివృద్ధికి భారీ నిధుల కేటాయింపు

  • గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు

  • ఇండస్ట్రియల్ గ్యారంటీ స్కీమ్స్

  • ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త విధానాలు

ఈ నిర్ణయాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, విద్యా రంగ అభివృద్ధి వంటి కీలక అంశాలను బడ్జెట్‌లో ప్రత్యేకంగా చరచించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Budget 2025 హైలైట్స్, కొత్త ఆదాయ పన్ను, పూర్తి వివరాలు
Budget 2025 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ డే ఎలా గడుస్తుందో తెలుసా