Union Budget 2022-23 : బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..

By Sumanth Kanukula  |  First Published Feb 1, 2022, 10:37 AM IST

కేంద్ర మంత్రి వర్గం (union Cabinet) మంగళవారం ఉదయం సమావేశం అయింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. కేంద్ర బడ్జెట్‌ 2022-23కు ఆమోదం తెలిపింది. 


కేంద్ర మంత్రి వర్గం (union Cabinet) మంగళవారం ఉదయం సమావేశం అయింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. కేంద్ర బడ్జెట్‌ 2022-23కు ఆమోదం తెలిపింది. నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా దృష్ట్యా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్ లెస్‌గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్​ యాప్​ను (Union Budget mobile APP) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 

పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్ కాపీలు..
నేడు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం.. బడ్జెట్‌ కాపీల బండిల్స్‌ను పార్లమెంట్‌ వద్దకు చేర్చారు. ఈ ట్రక్కులోని బడ్జెట్ పేపర్ల బండిల్స్‌ను కిందకు దించిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు, బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. 

Latest Videos

బడ్జెట్‌ ఎలా ఉండబోతుందో అని దేశంలోని ప్రజలు, అన్ని రంగాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌‌లో ఊరట కలిగించే అంశాలు ఉంటాయనే ఆశతో ఉన్నారు. మరోవైపు ప్రోత్సహకాలు, ఉపశమన చర్యలపై వివిధ రంగాల వారు ఆశలు పెట్టుకున్నారు.  80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉండనున్నాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

 

Union Finance Minister will present the Union Budget 2022-23 today in Parliament

Watch LIVE from 11 AM onwards📺https://t.co/nOc0qrDBSn pic.twitter.com/EMJb0jOAkS

— PIB India (@PIB_India)

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
అంతకు ముందు ముందు రాష్ట్రపతి భవన్‌కు (Rashtrapati Bhavan) చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman).. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ అంశాలను వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్​ కిషన్​రావ్​ కారడ్​, శ్రీ పంకజ్​ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
 

click me!