కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2021-22 ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక సర్వే (Economic Survey) అనేది.. వ్యవస్థలోని వివిధ రంగాల ఆర్థిక పరిస్థితులను వివరించడంతో పాటుగా, భవిష్యత్తులో వృద్దిని వేగవంతం చేయడానికి అవసరమైన సంస్కరణల వివరాలను అందజేస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2021-22 ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఆర్థిక సర్వే.. వ్యవస్థలోని వివిధ రంగాల ఆర్థిక పరిస్థితులను వివరించడంతో పాటుగా, భవిష్యత్తులో వృద్దిని వేగవంతం చేయడానికి అవసరమైన సంస్కరణల వివరాలను అందజేస్తుంది. అయితే నేడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలోని స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను స్వీకరించడానికి దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని సూచిస్తున్నాయి.
పెరిగిన ఆదాయం..
FY22లో ఆదాయాలు బలమైన పునరుద్ధరణను సాధించాయని సర్వే పేర్కొంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయి. అధిక విదేశీ నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), ఎగుమతుల వృద్ధి బలంగా ఉండటం కూడా ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది.
undefined
GDP అంచనాలు..
ఈ సర్వే ప్రకారం..2021-22లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు) జీడీపీ వృద్ధి 8-8.5 శాతం ఉంటుందని లెక్కగట్టింది. 2020-21లో జీడీపీ 7.3 శాతానికి క్షీణించిందని సర్వే వెల్లడించింది.
వ్యవసాయం
కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వృద్ది దశలో సాగాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.6 శాతం వృద్ది సాధించగా.. అది 2021-22లో 3.9 శాతానికి పెరుగనుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. పంటల వైవిధ్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రత్యామ్నాయ ఎరువులు.. వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
సేవల రంగం
కోవిడ్-19 మహమ్మారి సేవల రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గత ఆర్థిక సంవత్సరం సేవల రంగం వృద్ది 8.4 శాతానికి పరిమితం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరింతగా తగ్గుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం 8.2 శాతం వృద్ది నమోదు చేయవచ్చని పేర్కొంది.
పారిశ్రామిక రంగం
భారతదేశ పారిశ్రామిక రంగం 2021-22లో 11.8 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఆర్థిక వ్యవస్థను క్రమంగా అన్‌లాక్ చేయడం ,వివిధ రంగాలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటి ప్రణాళికలు, MSMEలకు అత్యవసర క్రెడిట్ లైన్ హామీ వంటి ఇతర విధానాలు.. రికవరీ వేగానికి సహాయపడతాయి.
వినియోగం
ప్రభుత్వ వ్యయం రూపంలో గణనీయమైన సహకారంతో 2021-22లో మొత్తం వినియోగం 7.0 శాతం పెరిగిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ
ప్రైవేటీకరణ డ్రైవ్‌ను పెంచడం, పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయాన్ని సేకరించడంలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఒక ముఖ్యమైన దశ అని ఆర్థిక సర్వే హైలైట్ చేసింది.
మూలధన వ్యయంలో పెరుగుదల
ఆర్థిక సర్వే ప్రకారం.. డిమాండ్, సరఫరాను పెంచే చర్య ప్రభుత్వం మూలధన వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు.